షర్మిల పొలిటికల్ కేరియర్ సర్వనాశనం.. తెరవెనుక రాజకీయం ఇదేనా..?
వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల పొలిటికల్ కెరియర్సర్వనాశనం దిశగా పయనిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు పెద్దఎత్తునసోషల్ మీడియాలో వినవస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తన పొలిటికల్ కెరియర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయంగా తనదైన శైలిలో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని సదుద్దేశంతో సొంతగా పార్టీ పెట్టి.. తనదైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్న వేళ.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు షర్మిలకు శాపంగా మారాయనే చెప్పాలి. కర్ణాటకలో తిరుగులేని విజయానికి సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే రిజల్ట్స్ ను దేశవ్యాప్తంగా రిఫ్లెక్ట్ అయ్యేలా అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోమ కర్ణాటక నుంచి షర్మిల కి పిలుపు వచ్చింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లో షర్మిల భేటీ అయ్యింది. డీకే శివకుమార్ పొలిటికల్ ములాకత్ అనంతరం షర్మిల ఢిల్లీ ప్రయాణమయ్యారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ తో భేటీ అయ్యారు. అయితే తెలంగాణలోనే తన పొలిటికల్ కెరియర్ ను కొనసాగించాలని షర్మిల సోనియా గాంధీకి చెప్పారు. అయితే తెలంగాణలో షర్మిలతో కలిసి పనిచేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షర్మిల మౌనంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలస్తోంది.
ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిల చేతులో పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నా.. తాను ఏపీలో రాజకీయాలు దూరంగానే ఉంటానని గతంలోనే తేల్చి చెప్పారు. మరోవైపు తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంకో వైపు పాలేరు సీటుపే తుమ్మల నాగేశ్వరరావు .., పొగులేటి శ్రీనివాస్ రెడ్డి లు కన్నేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పాలేరు టికెట్ ఎవరికీ దక్కిందో వేచి చూడాలి.
మరోవైపు కాంగ్రెస్ హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులు పాటు సిడబ్ల్యుసి సమావేశాలు నిర్వహించింది. తుక్కుగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు కార్యక్రమాల్లో షర్మిల హాజరు కాలేదు. అయితే షర్మిలకు ఆహ్వానం ఉందా లేదా అన్నది దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే ఆమె ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై పలు విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఒకసారి కాంగ్రెస్ తో పెట్టుకొని అన్న జైలు పాలు అయితే.. అదే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న షర్మిల తీరు పార్టీ శ్రేణులకు బొత్తిగా నచ్చటం లేదు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పజెప్పే అధిష్టానం చూస్తున్నప్పటికీ.. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షర్మిల పొలిటికల్ కెరియర్ ఎటువైపు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చర్ చేస్తున్నాయి.