సుప్రీంలో కూడా చంద్రబాబుకు చుక్కెదురేగా..?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు.., ఏసీబీ కోర్టుల్లో ఎదురు దెబ్బ తగలడంతో చంద్రబాబు తరుఫున న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎటువంటి అవినీతి జరగలేదని.. కావాలని రాజకీయ కుట్రతోనే  చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేశారని సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాస్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయమూర్తి సంజయ్ ఖన్నా బెంచ్ ఎదుట వాదనలు విపింపిచారు. ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత చూపారు. ఆ వెంటనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్ చేశారు లూథ్రా.

తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు లూథ్రా. పిటిషన్ లిస్టింగ్ తోపాటు తక్షణమే మధ్యంతర ఉపశమనం కలింగించాలని అభ్యర్ధించారు. 17-ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబు కస్టడీ లో పెట్టకూడనటువంటి కేసని సిద్ధార్ధ్ లూథ్రా తెలిపారు. ఈ  కేసులో తాము బెయిల్ కోరుకోవడం లేదన్నారు. జడ్ క్యాటగిరి.., ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా..? అని లూథ్రా ప్రశ్నించారు. అలానే ఈ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చంద్రబాబును కస్టడీకి అడుతోందని.. దీని నుంచి మినాహాయింపు ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా కోరారు.

దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేశారు. అంతేకాక సుప్రీం కోర్టుకు రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు శెలవు ఉన్న కారణంగా ఈ కేసు వాయిదా పడింది. ఐదు రోజుల తరువాత తిరిగి ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు వింటానని సీజేఐ చెప్పారు.