పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే అద్భుత కథ చిత్రం పెదకాపు-1 అని నిర్మాత రవీందర్ రెడ్డి మిర్యాల పేర్కొన్నారు.

బాలయ్యబాబుతో అఖండ సినిమా తీసి అఖండ విజయం సాధించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఆయన ప్రాజెక్ట్ లో తెరకెక్కిందే పొలిటికల్ థ్రిలర్ చిత్రం పెదకాపు-1. శ్రీకాంత్ అడ్డాల దర్శకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా తన బావమరిది విరాట్ కర్ణను పరిచయం చేస్తున్నట్లు రవీదర్ రెడ్డి మీడియాకు వివరించారు.

సెప్టెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ద కాపు-1 చిత్రం 1980 నాటి కథ. ఆనాటి రాజకీయ పరిస్ధితులను బేస్ చేసుకుని తెరకెక్కించారు మేకర్స్. ఒక బలమైన రాజకీయనేపథ్యంలో ఉన్న వ్యక్తికి.. ఒక బలహీన సామాన్యుడుకు మధ్య జరిగే సంఘర్షణ నడుమ సాగే పాత్రలకు ప్రాణం పోశారు దర్శకులు  శ్రీకాంత్ అడ్డాల. మాస్ ఓరింటేషన్ లుక్ తో  స్ర్కిన్ ప్లే కూడా అద్భుతంగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వస్తున్న రాజకీయ పార్టీకి యువత ఎలా కనెక్ట్ అవుతారో ఇందులో స్పష్టంగా కనిపించేలా చిత్రీకరించారు.  నిజ జీవితాన్ని తెరపైకి ఎక్కించిన అనుభూతి.., సన్నివేశానికి తగ్గట్లు కూర్చిన పంచ్ డైలాగ్స్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారునున్నట్లు తెలుస్తోంది.

రాజకీయం శక్తిని సామాన్యుడు ఎలా తన పోరాటం ద్వారా ఎదిరిస్తాడు అన్న కోణంలో సాగే చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని నిర్మాత రవీందర్ రెడ్డి మీడియా చీట్ చాట్ లో వివరించారు. అంతేకాక 1980 నాటి పరిస్ధితులను ప్రతిబింబేచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేసినట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి పరిశర ప్రాంతాల్లో కొన్ని సహజమై లోకేషన్స్ లో షూటింగ్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ చిత్రంలో కుల ప్రస్థానం లేదని..ఊరికి మంచి చేసేవారిని గ్రామాల్లో పెదకాపు అంటారని చిత్ర విశేషాలను ఆయన వివరించారు. కుటుంబంతోపాటు సమాజం కూడా నాదే .. నా వారే అనుకుంటే వారికి కష్టాలు వచ్చినప్పుడు వారికి ముందుండి పోరాడే వారే పెదకాపు అని పిలుస్తారని.., అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ ఖరారు చేసినట్లు రవీందర్ వెల్లడించారు.