చంద్రబాబు బెయిల్ పై రాజకీయం..!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు అరెస్టుపై ఏపీ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. రిమైండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ అప్లై చేయడంలో టీడీపీ న్యాయవాదులు ఎందుకు వెనకడు వేస్తున్నారు..? అన్నది అర్థం కానీ ప్రశ్నాల మారింది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులు లో వాదనలు విన్న ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో వివిధ సెక్షన్ లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఆ పార్టీ న్యాయవాధులుకానీ.. స్పెషల్ వాదనలు వినిపిస్తున్న సిద్దార్థ్ లూథ్రా కానీ బెయిల్ అప్లై చేయలేదు. కానీ జైల్లో బాబు భద్రత.., ఆరోగ్య రిత్యా హౌస్ రిమాండ్ ఇవ్వాలని పిటిషన్ వేసి కోరారు. అయితే ఆరోగ్య రిత్యా అన్నీ ఏర్పాట్లు చేస్తామని కోర్టు అంగీకరించినా.. హౌస్ రిమాండ్ కు మాత్రం నో చెప్పింది. ఈ క్రమంలో కూడా తిరిగి బెయిల్ అప్లై చేయలేదు చంద్రబాబు తరుఫున న్యాయవాదులు. తరువాత హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటిషన్ లు దాఖలు చేశారు చంద్రబాబు న్యాయవాదులు. అప్పుడు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇదే పెద్ద చర్చకు తెరతీస్తోంది.
ఎఫ్ఐఆర్ కాపీలో బెయిల్ అప్లై చేసుకోవచ్చు అని ఉన్న.. ఎందుకు చేసుకోవడం లేదు అన్న వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరో వైపు తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు సీఐడీ ఫాల్స్ కేసు నమోదు చేసిందని.. ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని.., రిమాండ్ ను రివ్యూ చేస్తే అసలు కేసే లేకుండా క్లియర్ ఇమేజ్ తో చంద్రబాబు బయటకొస్తారని భావిస్తున్నారు. అప్పుడు బెయిల్ తో పనిలేదు కదా.. అని వాదనలు కూడా లేకపోలేదు. ఇంకోవైపు రాజకీయ సంపతి కోసమే చంద్రబాబు జైల్లో ఉన్నారని వైసిపి శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ అప్లై చేయకుండా పొలిటికల్ గేమ్ కు తెర తీశారని విశ్లేషణలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.