బీజేపీతో పొత్తు.. పాతాళానికి దారేగా..!?
తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న వేళఅన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తులతో ముందుకు వెళ్లాలని సమాలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కలిశారు. తెలంగాణలో ఇరుపార్టీలు పొత్తుతో వెళ్లాలని.., దానికి అంగీకరించేలా నిర్ణయాలు తీసుకోవాలని పవన్ ను కిషన్ రెడ్డి కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బిజెపితో జత కలుస్తుందా..?అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే ఎలా ఉంటుంది అన్న దానిపై ఇప్పటికే పవన్ పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు.

అయితే.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మాదిరిగానే బిజెపి కూడా పతనకు అంచుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా.. ఇంకా మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతల సైతం కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పలేని పరిస్ధితి. ఏపీలో బీజేపీ పాత్ర మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసులు నుంచి కాపాడటం.. ఇక్కడున్న సహజ వనరులను అదాని కి దోచి పెట్టడం తప్ప రాష్ట్ర క్షేమానికి.., సంక్షేమానికి చేసింది ఏమీ లేదు అన్నది ప్రజలకు ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే ఏపీ ప్రజలు భవిష్యత్తులో కాంగ్రెస్ నైనా క్షమిస్తారే కానీ.. బిజెపికి మాత్రం ఓటు వేయరు అన్నది నిర్ణయానికి వచ్చారు. ఇదే సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా కృష్ణా.., గోదావరి జలాల్లో కలవటమే కానీ.. బ్రతికి బట్ట కట్టడం అనేది ఉండదు అన్న వాదన లేకపోలేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివిగా ఆ పార్టీ దరిద్రాన్ని వదిలించుకొని తెర వెనక పొత్తు పెట్టుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి. తెరమందు బీజేపీని తిట్టి పోస్తూనే.. బిజెపికి బీఆర్ఎస్ కు బీ – టీంగా వ్యవహరిస్తుంది అన్న టాక్ లేకపోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి 33 కేసుల్లో ముద్దాయిగా బెయిల్ పై బయట ఉన్నారు. మూడో పార్టీగా అవతరించిన జనసేనకు ఇంకా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో పార్టీ నిర్మాణం కాలేదు. నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పవర్ స్టీరింగ్ అంతా ఢిల్లీలోని బిజెపి చేతిలో పెట్టారు.

జగన్ మోహన్ రెడ్డి ఆయనపై ఉన్న కేసులు నుంచి బయట పెడితే చాలు.. ఇక ఏమీ వద్దు అన్న భావనలో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ వైసీపీ చేసిందేమి లేకపోగా.. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా నష్టపరిచారన్న భావనలో జనం ఉన్నారు.ఈ క్రమంలో జనసేన, టిడిపి కూడా బిజెపి పొత్తు పెట్టుకుంటే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అన్న వాదనలు లేకపోలేదు. మరి అయతే తెలంగాణ సక్రమమైన పొత్తు సంబంధం పెట్టుకొని.. ఏపీలో అక్రమ సంబంధం పెట్టుకుంటావా పవన్ అని ఆ పార్టీ పెద్దలే ప్రశ్నిస్తారు. అందుకే బిజెపి దరిద్రాన్ని వదిలించుకోవడం మేలు అని ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజనులు పెద్ద ఎత్తున జనసేనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

తెలంగాణలో 32 స్థానాలు జనసేన బలంగా ఉంది. పార్టీ గెలుపోటములను నిర్దేశించే పార్టీగా జనసేనగా ఎదుగుతోంది. ఈ క్రమంలో బిజెపితో పొత్తు పెట్టుకుంటే నష్టపోక తప్పదని విశ్లేషణలు లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలన్నిటిని తొక్కి పట్టి నారతీసి తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని మోదీ చేస్తున్న కుట్రలు అందరికీ తెలిసిన సంగతులే. ఆ ఉచ్చులో పడితే ఏ ప్రాంతీయ పార్టీ అయినా సర్వనాశనం కాక తప్పదు అన్న పొలిటికల్ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జనసేనాని బీజేపీతో పొత్తు.. తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఆ ప్రభావం చూపుతోంది.