టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. పవన్ కు ప్రధాన్యత..!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకెళ్లుతున్న నేపధ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ఏపీలో వచ్చే ఎన్నికలు వార్ వన్ సైడ్ చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలంటే పొత్తు అనివార్యం అని భావించిన ఇరుపార్టీలు జతకట్టి జగన్ రెడ్డిని ఇంటికి పంపాలని నిశ్చయించుకున్నాయి. దీంతో ఇక రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫ్యలాలపై ఉమ్మడి కార్యచరణ ప్రారంభించేందకు ఇరు పార్టీలు ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఫాం చేసింది. అంతేకాక రానున్న ఎన్నికల్లో భవిష్యత్తు గ్యారెంటీ హామీలను కూడా ప్రకటించింది. సోమవారం ఐక్యకార్యచరణ కమిటీ సభ్యులు మిని మేనిఫెస్టోను 11 అంశాలతో రూపొందించింది. అందులో పవన్ ప్రతిపాదించిన ఒక పథకం హైలెట్ గా కనిపిస్తోంది.

గతంలో టీడీపీ ఆరు గ్యారెంటీలతో పాటు జగసేన ప్రతిపాదించిన ఐదు గ్యారెంటీ పథకాలను మిని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీంతో టీడీపీ, జనసేన ఉమ్మడి మిని మేనిఫెస్టోలో 11 గ్యారెంటీ పథకాలను చేర్చింది కమిటీ. ఇందులో గతంలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాలైన మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్ వంటి వాటితో జనసేన ఐదు పథకాలు పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్ధల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధాని, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమ వంటివి కొత్తగా చేర్చారు. మేనిఫెస్టో విధివిధానాల వివరాలను టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియా వెల్లడించారు.

దీంతో 11 పథకాలు క్షేత్రస్ధాయిలో ప్రజా శ్రేయస్సుకు అన్నీవిధాలుగా దోహదపడేలా ఉన్నాయి.