alluri release date, Sree Vishnu: అల్లూరిగా వస్తున్న శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ లాక్ చేసిన యంగ్ హీరో – actor sree vishnu alluri movie release date announced

27
1660372159_pic.jpg

[ad_1]

డిఫరెంట్ క్యారెక్టర్లు.. సరికొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). తాజాగా మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీవిష్ణు హీరోగా.. ప్రదీప్ వర్మ డైరెక్షన్‌తో తెరకెక్కిన మూవీ అల్లూరి (Alluri). తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మూవీ యూనిట్ సభ్యులు. సెప్టెంబర్ 23న థియేటర్స్‌లో అల్లూరి మూవీ సందడి చేయనున్నట్లు తెలిపారు.

‘అతని పేరు.. అల్లూరి సీతారామరాజు! అతను నిజాయితీకి మారుపేరు..!’ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసి ప్రీ లుక్‌ పోస్టర్‌కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శ్రీవిష్ణు పవర్ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలె తీవ్ర అనారోగ్యాని గురైన శ్రీవిష్ణు.. తిరిగి కోలుకుని అల్లూరి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు.

గతేడాది మూడు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేశాడు శ్రీవిష్ణు. గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫాల్గుణ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. ఈ ఏడాది మేలో ‘భ‌ళా తంద‌నాన’ అనే చిత్రంతో అలరించాడు. అయితే ఈ మూవీ ఆశించినస్థాయిలో విజయం సాధించాలేదు. ‘అల్లూరి’ మూవీతో శ్రీవిష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

[ad_2]

27 thoughts on “alluri release date, Sree Vishnu: అల్లూరిగా వస్తున్న శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ లాక్ చేసిన యంగ్ హీరో – actor sree vishnu alluri movie release date announced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *