pawan kalyan, HBD Chiranjeevi: నా ప్రియమైన సోదరుడికి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ – power star pawan kalyan birthday wishes to megastar chiranjeevi

1661142120_pic.jpg

[ad_1]

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడికి.. అంటూ ఆయన ట్వీట్ చేశారు.

‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను..’ అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.

‘నా ఇన్‌స్ప్రేషన్.. నా ప్రియమైన మామ.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని.. జీవితంలోని ప్రతి రంగాలలో మాకు ఇలా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా..’ అని యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతూ హీరోలు వరుణ్ తేజ్, శ్రీకాంత్ ట్వీట్ చేశారు.

[ad_2]