తెలుగు చలన చిత్ర సీమ చరిత్రలో 69 ఏళ్ల రికార్డు బద్దలైంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులు మీదిగా అందుకున్నారు.

69 ఏళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఫ్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న మొదటి  తెలుగు హీరోగా అల్లు అర్జున్ ఈ అరుదైన రికార్డు సాధించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో సాగిన నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసం జరిగింది. ఈ ఉత్సవాల్లో వివిద కేటగిరిల్లో అవార్డుల సాధించిన నటీ నటులకు ఈ వేదికగా అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ నటుడిగా ఎంపికైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. పాన్ ఇండియా రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ నటనలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. ఈ చిత్రంలో ఆయన పేల్చిన డైలాగ్స్ అనేక వేదికలపై ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.

తెలుగు సినిమా చరిత్రలో అల్లు అర్జున తన సహజ నటనలో సాధించిన జాతీయ అవార్డు ఇంతవరకు ఏ ఒక్కరూ సాధించలేకపోయారు. 2014 వరకు ఈ పురస్కారాన్ని కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ లు ఒక్కొక్కరు మూడుసార్లు అందుకున్నారు.

తర్వాత స్థానంలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి, ఓంపూరి, నసీరుద్దీన్ షా, మోహన్ లాల్, అజయ్ దేవగన్ ఉన్నారు. బెంగాలీ, హిందీ, మరాఠి, మళయాలం చిత్రాల్లో నటించిన నటులే ఎక్కవసార్లు ఈ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు.

1954 నుంచి ఈ అవార్డుల ప్రధానోత్సవంలో జరుగుతోంది.  హీరో పాత్రలో మంచి నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఈ పురస్కారాలను భారత ప్రభుత్వం ఏటా ప్రకటిస్తోంది. రజత కమలం, రూ.50 వేల నగదు అందిస్తారు. ఈ నేపథ్యంలో 69 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో అల్లు అర్జున తొలి తెలుగు హీరోగా ఈ అవార్డులను అందుకున్నారు. దీంతో అల్లు అర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులచే ప్రశంసలు, అభినందనలు అందుకుంటన్నారు.

ఇదిలా ఉంటే మరో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపిక కాగా నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ విమర్శకుడిగా తెలుగు సాహితివేత్త పురుషోత్తమాచార్యులు కూడా ఇదే వేదికపై అవార్డులను అందుకున్నారు. అలానే ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పడింది. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలమన్, డ్యాన్స్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ శ్రీనివాస్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుగాను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ అవార్డులను అందుకున్నారు. అతేకాక బెస్ట్ పాపులర్ సినిమా కేటగిరిలో ఎంపిరైన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ అవార్డును అందుకున్నారు.