పాడెక్కిన ఆరోగ్యం.. ఆందోళనలో పేదలు..!

ఏపీలో జగన్ రెడ్డి పుణ్యమా అని పేదోడి ఆరోగ్యం పాడెక్కుతోంది. నెట్ వర్క్ ఆసుపత్రుల అల్టిమేటంతో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.

అన్నొస్తున్నాడు అన్నీ విన్నాడు అని చెప్పి 2019 లో గద్దెనెక్కాడు జగన్ రెడ్డి. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతూనే నాలుగునరేళ్ళు నెట్టుకొచ్చారు. సంక్షేమం పేరిట చేసిన సామాజీక, ఆర్ధిక, మౌలికాభివృద్ధి వంటి వాటిలో జరిగిన  విధ్వంసం ప్రజలు కళ్లారా చూశారు. 100 రూపాయల సంక్షేమం ఇచ్చి.. 1,000 రూపాయలు ఎలా లాగొచ్చొ ప్రాక్టికల్ గా ఏపీ ప్రజలు చూశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఆరోగ్యశ్రీ.. కాస్త అనారోగ్యశ్రీ గా మారింది. వైద్యానికి పెద్దపీఠ వేస్తాం అని చెప్పిన జగన్ రెడ్డి.. దాన్ని గాలికొదిలేశారన్నది నెట్ వర్క్ ఆసుపత్రుల అల్టిమేటంతో ప్రజలకు బోధపడుతోంది.

ఏపీలో వైద్యం పాడెక్కింది అన్నది ప్రజలకు క్షేత్రస్థాయలో అర్ధమైంది. పేదవాడు ప్రభుత్వాసుపత్రి కి పోతే జేబులు ఖాళీ అవుతాయి.. అన్నది గతంలో ఎన్నడూ చూడలేదు. వినలేదు. ఎందుకంటే ప్రభుత్వాసుపత్రిలో వైద్యం ఉచితం.., పరీక్షలు.., మందులు మొత్తం ఉచితం. అది ప్రభుత్వం బాధ్యత కూడా. అటువంటి పరిస్ధితి నేడు ప్రభుత్వాసుపత్రిలో లేదు.  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సర్కార్ ఆసుపత్రిలో కనీసం మౌలిక వసతులు కరువయ్యాయి. పరీక్షలకు కిట్లు లేక.., చికిత్సకు మందులు లేక ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది పడుతున్న నరకం వర్ణానాతీతం. దీనికి తోడు నిన్న ఆరోగ్య శ్రీ కింద పనిచేసే మల్టీస్పెషాలటీ నెట్ వర్క్  ఆసుపత్రులు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఇకమీదట ఆరోగ్యం శ్రీ కింద వైద్యం చేసేది లేదని తెగేసి చెప్పేశాయి. తమకు రావాల్సిన దాదాపు వెయ్యి కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయకుంటే ఆరోగ్య శ్రీ కింద వచ్చే పేదలకు వైద్యం చేసేదేలేదని క్లారిటీ  ఇచ్చాయి. ఈ నెల 27 లోగా ఆ ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను విడుదల చేయకుంటే.. తదుపరి కార్యాచరణ మొదలు పెడతాం అని ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ స్పష్టం చేసింది. అంతేకాక ప్యాకేజ్ ధరకు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ కృష్ణబాబుకు లేఖ రాశారు.

ఇది నాలుగునరేళ్ళుగా జరుగుతున్న తంతే. పేద వాడికి ఎమర్జెన్సీ  సమయంలో ప్రభుత్వం తరుఫున ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ నెట్ వర్క్ ఆసుపత్రి నందు వైద్యం అందించడం వైఎస్ఆర్ నుంచి వస్తున్నదే. ప్రభుత్వాసుపత్రిలో మందులు లేక.., కనీసం ఆరోగ్య శ్రీ ద్వారా అయినా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలనుకునే  ఆ అవకాశాన్ని కూడా జగన్ ప్రభుత్వం దూరం చేసింది.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉచితంగా విద్య, వైద్యం ప్రజలకు అందించడం అన్నది విధి. ఆ గురుతర బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించారు. దీంతో పేదవాడి ఆరోగ్యం పాడెక్కే సమయం దగ్గరపడిందన్నది కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం.