జగన్ దెబ్బకు.. ఏపీ బీజేపీలో కలవరం..!

జగన్ ఏదీ చేసినా.. దాని ప్రభావం స్వపక్షంతో పాటు మిత్రపక్షం మీదా కూడా పడుతోందన్నది వాస్తవం.

ఏపీ సీఎం జగన్ సర్వత్ర సంచలనాలకు కేంద్రబిందువు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలలో సిద్ధహస్తుడు.., లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులు.. 16 నెలలు జైలు.. కోడి కత్తి.. బాబాయ్ హత్య.. ఇలా అనేకంకాగా .. కారణాలు ఏవైనా.. ఆయన ఏపీకి సీఎం. కానీ ఏపీని అనాధల మార్చి.. అప్పులను పంచి.. లోటును పెంచి.. నేడు లక్షల కోట్లు అప్పులు పాలైలా చేసింది కాంగ్రెస్. ఇదిలా ఉంటే సర్వత్ర సర్వనాశనమై ఏపీని  చూసి హేళన చేసింది బీజేపీ.అతిపెద్ద జాతీయ పార్టీలుగా అవతరించి.. పెద్దన్న పాత్ర పోషిస్తూ.. ఏపీని అన్నీ విధాలుగా కూనీ చేసింది అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి.

ప్రత్యేక హోదా.., విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.., అసంబద్ధంగా ఇంకా నిర్మాణం అవుతూనే ఉన్న పోలవరం.., లోటు బడ్జెట్ కు నిధులు.., విశాఖ రైల్వేజోన్..ఇలా చెప్పుకుంటే పోతే ఇటువంటివి డజన్ల కొద్దీ ద్రోహాలను ఏపీ ప్రజలు చవిచూస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను తన రాజకీయ స్వార్థం కోసం  అలా విడగొట్టిన కాంగ్రెస్ ను ఇక్కడ విద్రోహ పార్టీగా మారితే.. అన్నీ చేస్తానని హామీలిచ్చి.. వివక్ష చూపుతున్న బీజేపీని విధ్వంసక పార్టీలా ప్రజలు బావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి.. జాతి సమైక్యాదరణకు పెద్దపీఠ వేసే జాతీయ పార్టీ అవసరత ఏర్పడి ఉందన్నది వాస్తవం.

ఈ క్రమంలో 2019 లో దోపిడి దారులకు, గజదొంగ తోడు మాదిరిగా ఒక వ్యవస్థ తయారైంది. కేంద్రతో కేసుల సఖ్యతను నడుపుతూ.. ఇక్కడున్న సహజ వనరులను.., పోర్టులను.., గనులను ఆ గుజరాత్ గజదొంగలకు దోచిపెట్టడం పనిగా పెట్టుకున్నారు. అధికారమనే ముసుగును తొడిగి తాపేదార్లు మాదిరిగా కార్పోరేట్ గజదొంగలకు రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారు. ఇరువురు వాటాలు వేసుకుని మరి.. పేదరికంలో అల్లాడిపోతున్న తల్లిని.. వివస్త్రరణ చేసి అడుక్కుతినేలా ఏపీని మార్చారు. నాలుగునరేళ్లు అభివృద్ధి.., ఉపాధి.., ఉద్యోగ అవకాశాల్లేక ప్రజలు రోడ్డున పడ్డారు. గత్యంతరం లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. దీనికి తోడు ప్రాథమిక హక్కులు కాలరాస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు .. ప్రశ్నిస్తే కటకటాల పాలు చేస్తున్నారు. అక్రమ కేసులు అనే ఆయుధంతో అడ్డొచ్చిన వారిని దాడి చేస్తూ.. జైలుకు పంపుతున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపి రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ- జనసేన పొత్తతో ఏపీలోనే కాదు ఢిల్లీ లో ఉన్న బీజేపీ నేతల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రోడ్లపై తిరగలేని పరిస్ధితి. నానాటికీ దిగజారిపోతున్న వైసీపీతో అంటకాగుతూ కేంద్రం పెద్దలు సాగిస్తున్న చేష్టలుడిగిన పనులు స్థానిక బీజేపీ కేడర్ కు  చిర్రేత్తిస్తున్నాయి.  మొన్న విజయవాడలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఏపీ బీజేపీ సీనియర్ల బాహాటంగానే రెచ్చిపోయారు. కేంద్రం పెద్దలు వైసీపీ పట్ల అనుసరిస్తున్న తీరు ఏమీ బాగా లేదని వాపోయ్యరంట.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో ఎన్డీఏలో ఉన్న జనసేన  టిడిపితో రాజకీయ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణంగా కూడా బీజేపీ పెద్దలు వైసీపీ చేష్టలను ప్రోత్సహించడమేనని కోర్ కమిటీ సమావేశంలో సీనియర్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారంట. బీజేపీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని పవన్ మాట్లాడటం కమలనాధుల్లో కలవరం మొదలైంది. ఇలా అయితే తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా బీజేపీ పరిస్థితి ఇంకా దిగజారిపోతోందని భావనలు వ్యక్తం చేశరంట. ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఇలా మా భవిష్యుత్తును తాకట్టుపెట్టాలని సరికాదని నిలదీసినట్లు అందుతున్న సమాచారం.

ఢిల్లీ పెద్దలకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా…? అంటూ కొందరూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ కేడర్ ను నిలపెట్టుకురావడం చాలా కష్టమని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏదీఏమైనా చంద్రబాబు అరెస్ట్ ఏపీ బీజేపీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చతో పాటు భవిష్యత్తు ఆత్మరక్షణ కార్యచరణను కూడా నలుగుతోందన్నది వాస్తవం.