నేడు ఢిల్లీకి జగన్ ..అందుకేనా..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ అనేక ప్రశ్నలను లేవనెత్తేలా చేస్తోంది. అన్ని కోణాల్లో జగన్ ఢిల్లీ టూర్ అందుకేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఏపీలో రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ ముందు.., ఆ తరువాత అన్నలా మారాయి. వేడెక్కిన రాజకీయాలతో .. ఆర్థిక అంశాల విషయంలో సర్వత్ర సమస్యల వలయాల మధ్య సాగుతున్న జగన్ ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు విపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ సాగిస్తున్న పాలనకు అద్దం పడుతోంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్. ఆ తరువాత తెలుగు దేశం నుంచి అనేక మంది అరెస్ట్ అవుతారని కథనాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మాజీ మంత్రులు నారాయణ, దేవినేని, అచ్చెంనాయుడు వంటి పెద్దల అరెస్ట్ లు కూడా ఉండనున్నట్లు చర్చ సాగుతోంది. అంతేకాక ఈనాడు రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలాజా వంటి వారు కూడా ఈ అరెస్టుల వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది.. వీరి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఢిల్లీ వేదికగా జగన్ మోదీ, అమిత్ షాలో చర్చేందుకే వెళ్తున్నాయని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. 31 కేసులు.., వాటిపై కోర్టు వాయిదాలు.., కొన్ని కేసుల మాఫి వంటి వాటిపై మాట్లాడేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని మరో వర్గం వారు చెప్పుకొస్తున్నారు.

ఇంకోవైపు ఏపీ తీవ్ర ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతూ.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందకు కూడా డబ్బులు లేవని.. ఈ నెలకు అవసరమైన రూ.15 వేల కోట్లను సద్దుబాటు చేయమని అభ్యర్ధించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నాయని వాదన లేకపోలేదు. వీటన్నీంటి కన్నా ముఖ్యంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావనపైనే జగన్ ఢిల్లీ బాట పట్టారని.. తెలంగాణతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపదన ఉంటుంది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో పాటు విపక్షాల్లోని కొంతమందిని జైలుకు పంపి ముందస్తు ఎన్నికలకు వెళ్తే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావచ్చునని జగన్ కుట్రలని తెలుగుదేశం ఆరోపిస్తుంది.

ఏదీఏమైనా క్లిష్టపరిస్థితుల్లో జగన్ ఢిల్లీ టూర్.. అనేకనేక ప్రశ్నలకు.., రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాకుంటే రాజకీయాల్లో ఏదీ జరిగిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదనే చెప్పాలి.