ప్రభుత్వం మోసం.. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు..?

ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకుని పనులు చేస్తే.. ఆ ప్రభుత్వమే నమ్మించి మెసం చేస్తే.. చివరికి ఇక మిగిలేది ఆత్మహత్యలేగా..? అని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

ఏపీ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉండే కాంట్రాక్టుర్లు నేడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, ఆర్ డబ్లూఎస్ వంటి వాటిలో పనులు చేసి బిల్లులుకాక రోడ్డుపడుతున్నారు. 2 వేల మంది కాంట్రాక్టర్లు.., రూ.20 వేల కోట్ల మేరకు అభివృద్ధి పనులు చేశారు. అందుకు సంబంధించిన బిల్లుల బకాయిలు నాలుగేళ్ళుగా  పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ళుగా బిల్లులు విడుదలకాక అప్పులు పాలైయ్యమని.., అప్పుల బాధలు భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంట్రాక్టులు వాపోతున్నారు. విజయవాడలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కాంట్రాక్టులు గోడు చెప్పుకున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుని.., తదుపరి కార్యాచరణ ప్రారంభించారు.

ఏపీలో అభివృద్ధి కుంటుబడటానికి ప్రధాన కారణం .. కాంట్రాక్టుర్లకు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను సకాలంలో చెల్లించపోవడమే. దాదాపు ప్రభుత్వరంగ ఇంజనీరింగ్ విభాగాల్లో కాంట్రాక్టు వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది జగన్ రెడ్డి ప్రభుత్వం.  జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ముందస్తు పెట్టుబడి పెట్టి కాంట్రాక్టు వర్క్స్ చేస్తే.. కుటుంబాలతో రోడ్డున పడాల్సి వచ్చిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. అప్పులోళ్ళ వేధింపులు భరించలేక 43 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకోగా.. ఈ పనులపై ఆధాపడి జీవించే దాదాపు 30 వేల మంది కార్మికులు రోడ్డుపడ్డారు. పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. ఇలా దాదాపు కాంట్రాక్టర్ల వ్యవస్ధ ఏపీలో నిర్వీర్యంకాగా.. పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లోని కాంట్రాక్టులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడాన్ని తప్పుబడుతున్నారు మిగతా జిల్లాల కాంట్రాక్టుర్లు. ఇదేక్కడి న్యాయం అని నిలదీస్తున్నారు. ఇందులో కూడా పక్షపాతమేనా..? అని ప్రశ్నిస్తున్నారు.   

ఏపీ సర్వనాశనంలో ప్రభుత్వం ఏ మేరకు నిర్లక్ష్య పాత్ర పోషించిందో దీనినిబట్టే అర్థమవుతోంది. కాంట్రాక్టు వ్యవస్థను నిలువునా నిర్వీర్యం చేసి.. వారి జీవితాలతో జగన్ రెడ్డి ఆడిన నాటకం.. నేడు రోడ్డున పడే పరిస్ధితికి వచ్చారు. ఆత్మహత్యలతో తనువు చాలించాల్సిన దుస్ధితికి దిగాజారింది. దీంతో ఇక ప్రభుత్వంపై యుద్ధం చేసైనా సరే పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను సాధించుకుంటామని ఉద్యమిస్తున్నారు కాంట్రాక్టర్లులు. విజయవాడ కేంద్రంగా ధర్నాలు.., వంట వార్పులతో తమ నిరసన గళాన్ని వినిపించేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు.