గేరు మారుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు..ఇక దెబ్బ అదుర్సేగా..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న చేష్టాలకు ఆయనకు సైకో అని నామకరణం చేసింది తెలుగుదేశం. అది నేడు కరెక్టే అని ప్రజలకు సైతం ఒప్పుకుంటున్నారు.

జగన్ చర్యలను చూసిన తెలుగుదేశం పార్టీ.. ఆయనకు సైకో అని పేరుపెట్టారు. వేదికలపై సైకో జగన్ అని సంభోదిస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు టీడీపీ నేతలు. దీంతో అప్పుడు ఎందుకు అలా జగన్ తిట్టేది అని అందరూ కొంత జగన్ పట్ల జాలి చూపారు. కానీ పోనుపోనూ తెలుగు దేశం నేతలు పెట్టిన ఆ పేరే ఆయనకు సరిగ్గా సరిపోతోందని జాలి చూపిన వారే ఒక అంచనాలకు వచ్చారు. నిత్యం ఏదో ఒక ఇష్యూలో జగన్ ప్రభుత్వం.., ఆయన పార్టీ తెరపైకి రావడం సర్వసాధనమైన విషయం. ఆ మధ్య ‘గడపగడపకు మన ప్రభుత్వం’తో ప్రజల్లోకి వెళ్లినా.. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు.., మంత్రులకు చేదు అనుభవాలు ఎన్నో.  ఆ తరువాత ‘వై ఏపీ నీడ్స్ జగన్’ తో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావించారు. కానీ.. ఎందుకో అది అప్పుడు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే గురువారం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది వైసీపీ.  

తాజా మొదలుపెట్టి సామాజీక సాధికార బస్సు యాత్ర తుస్సు మంది. ప్రజలు నుంచి పెద్దగా ఆధారణ రాకపోవడంతో కార్యక్రమం అట్టర్ ప్లాప్ షో గా ముగిసింది. దీనిపై వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దగా దృష్టిసారించకపోవడం గమనార్హం.  అయితే ఈ నేపధ్యంలోనే పార్టీ నేతలను నమ్ముకుంటే నట్టేట్లో మునిగినట్లేనని కొత్త ఎత్తుగడకు తెరతీశారు. అదే ‘ తననే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలో’ ప్రజలకు వివరించాలని అధికారులకు హుకుం జారీచేశారు. జిల్లాలు వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం… అందులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్ చేస్తున్నారు..? అని అధికారులు మదనపడుతున్నారు. జగన్ ప్రభుత్వం పీడ ఎప్పుడు వదులుతోందని వేయి కళ్ళతో ఎదురు చూసే మాకు .. ఇటువంటి కార్యక్రమాలను మాకేందుకు తగిలిస్తున్నారని అధికారులు పెదవి విరుస్తున్నారు.

నాడు – నేడు ప్రభుత్వాల మధ్య జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించి .. ఓట్లు దన్నుకోవాలని చూస్తున్నారు జగన్. అయితే జగన్ ఎత్తుగడకు అధికారులు సైతం గండికొట్టే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జగన్ చేసిన అన్యాయం, భూటకపు హామీలు వారు చచ్చే వరకు గుర్తు పెట్టుకుంటారు. ఈ క్రమంలో ‘తననే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలో’ కార్యక్రమ బాధ్యతలను అధికారుల అప్పజెప్పడం వారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే జీతాలు సక్రమంగా ఇవ్వకుండా..,  సీపీఎస్ రద్దు చేస్తాని చేయకుండా .. అనేక అంశల్లో ఉద్యోగులు తీవ్రంగా దగా పడ్డారు. ఇదే అదునుగా జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో ‘తననే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలో’ బాధ్యతలు అధికారులకు అప్పజెప్పడంతో కక్ష తీర్చుకునేందుకు ఇదొక సదావకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ప్రజలకు జగన్ చేసిన మంచి కన్నా.. రాష్ట్రానికి వచ్చిన కష్టం.. ఆ తరువాత జరిగినా.., జరుగుతున్నా నష్టాన్ని వివరించే ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా ఈ కార్యక్రమానికి అధికారులు సమాయక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.