చంద్రబాబు కేసుల్లో కోర్టులు కీలక తీర్పులు..!

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేసుల్లో బుధవారం కీలక తీర్పులు వెలువడనున్నాయి.

స్కిల్ కేసులో  అరెస్ట్ అయిన చంద్రబాబు.., అనంతరం ఆయన అనారోగ్యం దృష్ట్యా హైకోర్టు మెడికల్ గ్రౌండ్స్ లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి సంబంధించిన ఆపరేషరన్ పూర్తి అయ్యింది. ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టులో.., సుప్రీం కోర్టుల్లో కీలక తీర్పులు చంద్రబాబు కేసుల్లో వెలువడనున్నాయి.  

చంద్రబాబుపై నమోదు చేసిన వరుస కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాదులు. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకను అందరికీ ఉచితంగా ఇచ్చారు. దీంతో రాష్ట్ర ఖజానాకు ఇసుక ఆదాయం గండికొట్టిందని.., తద్వారా ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆరోపింస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. దీనిపై మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను చంద్రబాబు దాఖలు చేశారు.

తనను న్యాయపరమైన చిక్కుల్లో పడివేసి.. జగన్ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు విన్నవించారు. రాజకీయపరమైన అంశాల్లో తనను దూరం పెట్టాలని లక్ష్యంతో కుట్రలు జరుగుతున్నాయని.., అందుకే విధానపరమైన నిర్ణయాల్లో తన ప్రమేయాన్ని అధికంగా చూపుతూ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇసుక కేసులో ముందస్తు బెయిల్ పై  వాదనలు జరగనున్నాయి. వాదనలు అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్ వస్తోందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో  వాదనలు ముగిసి.., కేసును రిజర్వు చేసింది ధర్మాసనం. ఆ తీర్పు నేడు వెలవడనున్నది. స్కిల్ కేసు నిబంధనలకు విరుద్ధంగా నమోదు అయిందని.., 17ఏ పాటించి.., గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకున్న తరువాతే చంద్రబాబును అరెస్ట్ చేయాలని చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరుఫున ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు.

ఇరువురి వాదనలు విన్న సుప్రీం తీర్పును రిజర్వు చేసింది. దీనిపై తుది తీర్పు నేడు విడుదలకానున్నది. ఫైనల్ గా మెరిట్స్ ఆధారంగా చంద్రబాబుకే అనుకూలంగా తీర్పు వెలువడనున్నట్లు చంద్రబాబు తరుఫున న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.