బురద రాజకీయాలు బోధపడ్డాయ్..! దొర డ్రామా ఆపు..!

ఓట్ల కోసం తెలంగాణ కొందరు ఎన్టీఆర్ పేరును జపిస్తున్నారని.. ఆ ప్రేముంటే చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడాలని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య డిమాండ్ చేశారు.

ఓట్ల కోసం తెలంగాణలో కొత్తనాటకానికి తెరశారు. ఏపీలో రాజకీయాలన్నీ చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికారపార్టీ ఎన్టీఆర్ పేరునే జపించడం ఏమిటని..? నట సింహం.., హిందూపురం  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణప్రశ్చించారు.   బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయంగా ఏ చిన్న అవకాశాన్ని ఏ పార్టీ వదలుకోవడం లేదు. అందులో అధికారపార్టీ అన్నీ పార్టీల కన్నా ముందు వరుసలో ఉంటుంది. ఆ పార్టీ మంత్రులు.., కేటీఆర్, కేసీఆర్ లు ఈ మధ్య తెలుగు దేశం పార్టీ గురించి తన ప్రసంగాల్లో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రాంతాలువారీగా.., కులాలువారీగా  విభజించి.. గెలుపే లక్ష్యంగా వెళ్తున్న బీఆర్ఎస్ కు తెలంగాణ తెలుగు దేశం ఒక ప్రయత్నాయ శక్తిగా కనిపిస్తోంది. తెలంగాణలో సెటిలర్స్.., తెలుగు దేశం మద్దతుదారుల ఓట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ సాగిస్తున్న రాజకీయాన్ని బాలయ్య ఇన్ డైరెక్ట్ గా ఎండగట్టారు.

అందుకే మొన్న  ఈ మధ్య పిలువని పేరంటానికి ఖమ్మం వెళ్ళి 40 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ కు మొక్కారు మంత్రి కేటీఆర్. ఆయనొక శక్తి.. ఆ పేరులో పవర్ ఉంది.. ఆ పేరే మా నాన్న నాకు పెట్టారు .. అని ఖమ్మంలోని కమ్మ.., బీసీ ఓటర్లును ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్టీఆర్ మరణాంతరం తెలుగు దేశం పార్టీ క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు అనివార్య పరిస్ధితి పార్టీని భుజస్కందాలపై వేసుకుని నడిపించిన చంద్రబాబును మరిచి మరి .. ఖమ్మంలో కేటీఆర్ చేసిన ప్రసంగం అందరూ చూశారు. విజన్ 2020 ఫలాలే హైదరాబాద్ సర్వతోముఖంగా నేటి పారిశ్రామీక ప్రగతి. సాంకేతికత, ఐటీ కారిడార్.., ఫార్మా హాబ్.., ఫ్లైవర్లు.. ఔటర్ రింగురోడ్లు వంటి డజన్ల కొద్ది సంస్కరణ తీసుకొచ్చిన నేత చంద్రబాబు. హైదరాబద్ అభివృద్ధికి రాయేత్తిన కూలి.., దార్శినికుడు.., రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబును, ఆపార్టీని మరిచి కేసీఆర్ చేస్తున్న కుటీల రాజకీయాలు ప్రజలకు బాగానే అర్ధమవుతోందని బాలయ్య మీడియా ముఖంగా అర్ధమయ్యేలా చెప్పారు.  

గుణాత్మకంగా రాజకీయాలని బలపం కట్టుకుని దేశం మొత్తం తిరిగిన అక్కడి ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ ను నమ్మలేదు. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు సొంత రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్ ఆపసోపాలు పడుతున్నారు. సర్వేలన్నీ కేసీఆర్ ఘోర ఓటమి చవి చూడక తప్పదని లెక్కలు వేస్తున్నాయి. సీనియర్లందరూ పార్టీని వీడి గాంధీ భవన్ బాటపట్టారు. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు గుడ్ బై చెప్పడంతో నియోజకవర్గాల వారీగా  సామాజీక సమతుల్యత.., పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతిన్నది. ఆయా సామాజీకవర్గ ఓట్ల కోసం ప్రగతి భవన్ లో కూర్చోని కొడుకును.., అల్లుడును.. ఆ పార్టీ మంత్రులను తెలుగుదేశం.., ఎన్టీఆర్ జపం చేయమని చెప్పి పంపుతున్నాడని ఇప్పటీకే సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్నారు.

ఈ రోజు జనసేనాని పవన్ పెడన వారాహి యాత్రలో తెలంగాణలో కూడా జనసేన ఉంది అని డైలాగ్ తో గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు అడ్డం తిరిగి..కేసీఆర్ ను ఇంటికి పోవడం ఖాయమని విశ్లేషణలు ఊపందుకున్నాయి. అదే వేరే పార్టీలతో పొత్తు రాజకీయాలు వాడి.. ఇక్కడ కూడా ప్రభుత్వ ఓటు బ్యాంకు చీలకూడదు అన్న రాజకీయ అస్త్రాన్ని ప్రయోగిస్తే.. ఆ పొత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ చిత్తైనా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సీట్లతో పాటు అధికార బీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించేందుకైనా ఈ పొత్తు వ్యూహం ఉపయోగపడుతోందని అంచనాలు ఉన్నాయి.  ఇదే ఫార్మూలా తెలుగుదేశం వ్యూహ రచన చేస్తే.. బీఆర్ఎస్ పరిస్ధితి ఏంటీ..? అని సోషల్ మీడియాలో ఇరు పార్టీల అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో బాలయ్య పేల్చిన డైలాగ్స్ .. బీఆర్ఎస్ ను కాల్చక మానవు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.