bamba bakya passed away, Singer Bamba Bakya: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ బాంబా బాక్య కన్నుమూత – tamil singer bamba bakya passed away at 49 in chennai hospital


కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగ‌ర్ బాంబా బాక్య (Bamba Bakya) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 49 ఏళ్లు కాగా.. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ స్టార్ సింగర్ గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడిన బాంబా బాక్య ఆకస్మిక మరణం పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాడిన పాటలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతంలో సర్కార్‌లో ‘సిమ్‌దంగారన్..’, రోబో 2.0లో ‘పుల్లినాంగల్..’, బిగిల్‌లోని ‘కాలమే కాలమే..’ వంటి పాటలు పాడి తమిళ సినీ అభిమానుల్లో పాపులర్ అయ్యారు బాంబా బాక్య. ఆ మధ్య ఆయన పాడిన ‘అది కెక్కు ఉన్న దిరమ్ను వైకిరియే..’ ఆల్బమ్ అన్ని చోట్లా సూపర్ హిట్ అయింది. ఇటీవలె మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్‌’ మూవీలోని ‘పొంగేన‌ది’ పాటను బాంబా బాక్యనే పాడారు.

బాంబా బాక్య మరణం ఎంతో బాధించిందంటూ హీరో కార్తి అన్నాడు. ‘బాంబే బాక్య ఆక‌స్మిక మ‌ర‌ణం నాకు ఎంతో బాధ కలిగించింది ఈ బాధను.. న‌ష్టాన్ని త‌ట్టుకునే శ‌క్తి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కార్తి రాసుకొచ్చాడు. ఇతర సినీ ప్రముఖులు కూడా బాంబా బాక్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.