ఏపీలో బూతు రాజకీయాలు.. అరెస్ట్ ల పర్వం..!

ఏపీలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైల్లో వేసి.. హింసాపాత రాజకీయాలను ప్రేరిపిస్తున్నారని సోషల్ మీడియాలో విశ్లేషణలు ఊపందుకున్నాయి.  

చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయ స్వరూపం ఒక్కసారిగా మారింది. జనసేనాని పవన్ టీడీపీతో పొత్తు అనగానే ఇరు పార్టీ నేతలకు అదనపు బలం చేకూరినట్లైంది. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న కేడర్లు ఒక్కసారి విజృంబించడం ప్రారంభించాయి. చంద్రబాబు అరెస్ట్ పై బాహాటంగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై కొద్దొగొప్ప వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. దీన్ని చల్చారే ప్రయత్నంలో ఏపీలో హింసాత్మక ఘటనలు ప్రేరేపితం అవుతున్నాయి.

చంద్రబాబు అరెస్ట్ లో లబ్ధి ఆ పార్టీకా..? ఈ పార్టీకా..? అన్నది పక్కనపెడితే.. దీనిపై ప్రజలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకో వైపు రాజకీయాలు రెచ్చిపోతున్నాయి. అధికార.. విపక్ష నేతల మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరి.. వ్యక్తి దూషణలకు సైతం వెనుకాడడం లేదు. నోటికి అడ్డూఆపు లేకుండా బెడ్ రూం కథల నుంచి బ్లెడ్ బాత్ సీన్ల వరకు జరిగిన భాగోతాలను సైతం బాహ్య ప్రపంచానికి తెలిసేలా మీడియాలో.., వ్యక్తిగత సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారం పార్టీ వారు విపక్షాలను అమ్మనా బూతులు తిట్టినా.. నో కేసు. అదే విపక్షాలు చిన్నపాటి పరుషపదజాలం వాడినా ఈడ్చుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం. దర్జాగా జైలుకెళ్లి సింపతి తెచ్చుకుని తిరిగి ప్రజా ప్రతి నిధులుగా మారుతున్నారు. ఇందుకు విపక్షాలకు అధికార పార్టీనే అవకాశమిస్తోందనే చర్చ బాగానే సాగుతోంది

నిన్న రాత్రి విశాఖ జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ హైడ్రామా మధ్య పొలిటికల్ చర్చకు దారితీసింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుంటూరు పోలీసులు బండారు అరెస్ట్ చేసి, గుంటూరుకు తరలించారు. అయితే ఇక్కడ కొసమేరుపు ఏంటంటే.. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు దొంగాల్లా గోడదూకి వెళ్లడం.. అర్థరాత్రి తలుపు తీయలేదని వాటిని బద్ధలుకొట్టి బండారును లాక్కెళ్ళి పోలీసులు వాహనంలో ఎక్కించి గుంటూరుకు తీసుకుపోవడం. ఇలా ఇంతటి ఉద్రిక్త వాతావరణంలో అలా అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని తెలుగు దేశం పశ్నిస్తుంది.

అధికార వైసీపీ లో అర గంట అంబటి నుంచి అమ్మనా బూతులు తిట్టే కోడాలి.., వల్లభనేని.. ద్వారంపూడి వరకు  ఇలా డజన్ల కొద్ది బ్యాచ్ నిత్యం మీడియాలో నోరు తెరిస్తే పచ్చి బూతులే. మరి వారికేందుకు ఈ చట్టాలు.. ఈ అరెస్ట్ లు వర్తించవు అన్నది కామాన్ మెన్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు.