నటసింహం బాలయ్యబాబు భగవంత్ కేసరి టైలర్ విడుదలైంది.విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్స్ వీవ్స్ ను సొంత చేసుకుంది.

 భగవంత్ కేసరి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను  మేకర్స్ వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూసి అభిమానులు ఇక పూనకాలే అని ఫిక్స్ అయ్యారు. బాలయ్య మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ తో పాటు శ్రీ లీల ఎమోషనల్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ‘నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలే.. అప్పుడే ధునియా నీ బాంచెన్ అంటది’ .. అంటూ తెలంగాణ యాస లో బాలయ్య చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది.

బిడ్డను ఆర్మీ సెలక్షన్స్ కు పంపే యత్నంలో చేసే తండ్రి పాత్రలో బాలకృష్ణ కనిపించారు. ఫుల్ మాస్ యాక్షన్ మూవీ రేంజ్ కథలా ట్రైలర్ తలపిస్తోంది. శ్రీలీల ను విలన్ భారీ నుంచి కాపాడే సమయంలో బాలయ్య  వినూత్నంగా ఒక ఆయుధాన్ని తయారు చేసుకుని ఫైట్ చేసే తీరు సంబ్రామాశ్చర్యానికి గురిచేస్తోంది. ఫైట్స్ లోపాటు .. మధ్యమధ్యలో బాలయ్య చెప్పే ఊర మాస్ డైలాగ్స్ థియేటర్స్ లో విజుల్స్  మోతమోగడం ఖాయమనట్లు తెలుస్తోంది.

అంతేకాక ఈ ట్రైలర్ తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.., చిత్రంలోని పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంతేకాక చిత్రంలో ప్రముఖ తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో తలపడనున్నారు.

బాలయ్యకు భార్య పాత్రలో నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. దసరా బరిలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 19న గ్రాండ్ గా థియేటర్ల ప్రేక్షకుల ముందుకు రానున్నది. తమన్ ఇప్పటికే పాటలతో పాటు.., అదిరిపోయే లెవల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. వరుస శెలవుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.