బీజేపీ లిస్ట్ సిద్ధం.. కేసీఆర్ కు ఆయనే పోటీ..!

తెలంగాణ సాధరణ ఎన్నికల  నేపథ్యంలో  భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

ఎన్నికల బరిలో గట్టిపోటినిచ్చే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేసేందకు రంగం సిద్ధం చేస్తోంది. 50 మంది అభ్యర్థులను  తొలి జాబితా గా నేడు ప్రకటించేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆశావాహులల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి గజ్వేల్ నుంచి  కెసిఆర్ కు పోటీగా ఈటల రాజేంద్రను బరిలో దించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది బీజేపీ అధిష్టానం.

 తెలంగాణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మలకు పదును పెడుతున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు తెలంగాణ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను  పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక జాబితా పై ఆమోదం ముద్ర వేశారు.

 కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిన జాబితాను శనివారం బిజెపి ప్రకటించనున్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో  బిజెపి తరఫున ముగ్గురు ఎంపీలు పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బోథ్ నుంచి అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, కోరుట్ల నుంచి నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బరిలోదించినట్లు పార్టీ నిర్ణయించింది. అలానే మాజీ ఎంపీ వివేక్ ను  చెన్నూరు నుంచి, డీకే అరుణ ను గద్వాల్ నుంచి పోటీకి దించనున్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కూడా  అదే నియోజకవర్గంలో నుంచి  పోటీ చేయనున్నారు. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత పై ఇంకా చిక్కుముడి వీడలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లను ఎన్నికల కీలక బాధ్యతలను అప్పగించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత..  సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.