కీలక నిర్ణయాలు కమలానికి కలిసొచ్చేనా..?

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్ధిలను బరిలో దించుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్ధి జాబితా ఫైనల్ అయ్యింది. వారు గత నెల రోజులుగా నియోజకవర్గాల్లో చురుగ్గా తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటితో కాంగ్రెస్ అభ్యర్ధులు జాబిత విడుదలైనప్పటికీ 10 నుంచి 15 స్థానాల్లో కొంత పేచీలున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబిత విడదలకు రంగం సిద్ధం చేస్తోంది.

కలనాథుల అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు పూర్తి చేసుకుని ఈ నెల 15 లేదా 16 న మొదటి జాబిత ప్రకటించనున్నారు. అయితే మూడు దఫాలుగా ఆ పార్టీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్.., బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీ లో చేరిన నేతలు అసంతృప్తిలుగా మారడంతో ఆ పార్టీకి కొంత తలనొప్పిగా తయారైంది. దీనికి తోడు నేతల మధ్య ఐక్యత లోపించడం కూడా ఆ పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.

బీజేపీ అసంతృప్తి వాదులను మొన్న తెలంగాణలోని ఘట్ కేసర్ సభకొచ్చిన నడ్డాతో కూర్చొపెట్టి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ ఎన్నికల కమిటీలో చేర్చారన్న  ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ముందుకు సాగుతున్నారు.  

ఆ మొన్న మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు నుంచి ఎన్నికల శంఖరావం పూరించారు.రాష్ట్రం లో గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు,పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే.