ప్రచార పదును పెంచాలే..కేసీఆర్ వ్యూహం..!

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సయయం ఆసన్నమవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు వినూత్న ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాజకీయ పార్టీలు.. వినూత్న ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు.  హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుకుంటుంటే.. ఈ సారి ఎలగైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ అండ్ కో.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా గౌరవప్రదమైన సీట్లను కౌవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే నేడు కేసీఆర్ అధ్యక్షతన వార్ రూం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఎన్నికల ఇన్ చార్జీలు, వార్ రూమ్ ఇన్ చార్జీలతో ఆయా నియోజకవర్గాలలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.., ప్రజల్లోకి మేనిఫెస్టోను ఎలా తీసుకుపోవాలి .. అన్నదానిపై కేసీఆర్, హరీశ్ రావులు దిశ నిర్ధేశం చేస్తారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో వార్ రూం లను ఏర్పాటు చేసి.. పోలింగ్ బూత్ ఇంచార్జ్ లను నియమించి.. ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వం అందిన సంక్షేమాన్ని.., మేనిఫెస్టోను తీసుకుపోయేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

అలా.. బూత్ ఇంచార్జ్ లను నియామకం తరువాత వార్ రూం మెరిట్స్ ను అధిష్టానానికి పంపాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్ధుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.