చంద్రబాబుపై ప్రేమా, జాలా..?బీఆర్ఎస్ డ్రామాలకు అర్థాలే వేరా..?

నిజంగా తెలంగాణ మంత్రులు.., ఎమ్మెల్యేలు ఏదో ఒక సందర్భంలో ఈ మధ్య చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకుండా వారి ప్రసంగాలను ముగింపు పలకడం లేదు. ఎందుకో..?

చంద్రబాబు అరెస్టై నేటికి 37 రోజులు. ఏపీతో పాటు తెలంగాణలో సెటిలర్స్ నిరసనగా రోడ్డెక్కారు. అరెస్ట్ అక్రమమం అని వెలిగెత్తి నినదిస్తన్నారు. సంఘీభావాలు తెలుపుతున్నారు. ఇదంతా ఒక కోణమైతే బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల వేళ మరోకోణం అవిష్కృతమౌతోంది.గ్రేటర్ నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలు.., మంత్రులు సెటిలర్స్ ఓట్లు కోసం డ్రామాలు మొదలుపెట్టింది. మరోవైపు నచ్చినా.. నచ్చకున్నా.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమం అని మాట్లాడక తప్పని పరిస్ధితి. కొందరైతే ఒకడుగు ముందుకేసి మల్లారెడ్డి మాదిరిగా రియాక్ట్ అవుతున్నారు. కేటీఆర్.., హరీశ్ రావులు నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారే కానీ.., లైన్ క్రాస్ చేయడకుండా జాగ్రత్తలు పడుతూనే వస్తున్నారు.

మరి ఎంటా లైన్..?, క్రాస్ చేస్తే ఏమైద్ది..? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ప్రముఖంగా వినిపిస్తున్న మాటలు. కేసీఆర్ ఇంటి నుంచి మాట్లాడే కేటీఆర్, హరీశ్ రావులు చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడాల్సి వస్తే.. సీనియర్ నేత.., అంత వయసులో ఆయన్ను జైల్లో పెట్టడం సరికాదు.., రాజకీయాల్లో ఈ తరహా తగదు అని అంటారే తప్పా.. జగన్మోహన్ రెడ్డి చర్యలు.., ఆయన పార్టీ తెర వెనుక రాజకీయాల గురించి అసలు ప్రస్తవించరు.

ఎందుకంటే కేసీఆర్, జగన్ రెడ్డిల మధ్య ఉన్న బాండింగ్ అలాంటి. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకీ.., ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండానే జరిగిందా..? వారి డైరెక్షన్ లేకుండా బాబును అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లోనే ఉంచుతారా..? అన్న ప్రశ్నలు ఏపీ, తెలంగాణలో చిన్నపిల్లొడిని అడిగినా చెప్తారు. జగన్ కుట్రలను వేలేత్తి చూపుతారు. కానీ.. కేటీఆర్, హరీశ్ రావు, తలసాని తదితర మంత్రుల బ్యాచ్ మాత్రం లైన్ క్రాస్ చేయకుండా  జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయల కుట్రలను ప్రశ్నించరు. ఎందుకంటే దోస్తీ భయం అలా చేస్తోందన్న మాట. అందుకే చంద్రబాబుపై ఈ ప్రేమ.., జాలి అని సోషల్ మీడియాలో విశ్లేషణలు లేకపోలేదు.

ఇంకోవైపు నిన్న మంత్రి మల్లారెడ్డి ఇండియాలోనే నారా చంద్రబాబు బెస్ట్ సీఎం అని కితాబిచ్చాడు.అంతేకాక విచార వదనంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆయన పరిస్ధితి చూస్తే ఏడుపొస్తోందని.., ఇది వైసీపీ.., బీజేపీ కుట్ర అని కామెంట్స్ చేశారు.

చంద్రబాబు అరెస్టేమో కానీ.., ఎన్నికల వేళ.. స్థానికంగా ఉంటున్న సెటిలర్స్ ఓట్లును ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్ కన్నా.. బీఆర్ఎస్, బీజేపీ పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు అన్నది ఇట్టే అర్థమౌతోంది.