కారు గుర్తుపై వీడని చిక్కుముడి.. గందరగోళంలో బీఆర్ఎస్..!

ఎన్నికల సయమంలో ప్రతిసారి కారు గుర్తుపై ఏదో ఒక గందరగోళం లేవనెత్తుతూనే ఉంది బీఆర్ఎస్. కానీ ఎన్నికల సంఘం నేటికీ స్పందించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎన్నికల గుర్తుపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఆ పార్టీకి తిప్పలు తప్పవు అన్నట్లు కనిపిస్తుంది. గతంలోనూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తును వేరే ఒక పార్టీకి ఉన్నాయని వాటిని తొలగించాలని ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం అభ్యర్థించింది. ఎన్నికల సంఘ నుంచి స్పందన రాకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల గుర్తుపై బీఆర్ఎస్ వేసిన పిటీషన్లను  ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. అయితే దాదాపు 240 రోజులు తర్వాత  హైకోర్టులో కొట్టివేసిన పిటిషన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇన్నీ రోజులకు గుర్తు వచ్చిందా ..? మీకు అంటూ కౌంటర్ ఇచ్చింది ధర్మాసనం. అంతేకాక ఈ పిటిషన్లు కూడా తిరస్కరించింది.

 రోడ్డు రోలర్, ఆటో, చపాతి రోలర్ వంటి గుర్తులు కారును పోలి ఉన్నాయన్నది బీఆర్ఎస్ ఆరోపణ. కొత్తగా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు ఈ గుర్తులను కేటాయించారని వాపోతోంది బీఆర్ఎస్. వీటిని ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగించాలని..,వీటితో బీఆర్ఎస్  తీవ్రంగా నష్టపోతుందని కోర్టును ఆశ్రయించడం జరిగింది.

 మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బృందం కలిసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించ వద్దని సీఈసీకి వారు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఇలాంటి గుర్తులు వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయామని ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల గుర్తింపు పొందిన పలు పార్టీలు కారు గుర్తును పోలి ఉన్నాయని.., వాటిని పునః సమీక్షించాలని సీఈసీని కోరారు.