బీటెక్ రవికి రిమాండ్.. ఖండించిన టీడీపీ..!

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కు కడప జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి తీర్పుతో ఆయనకు జిల్లా కారాగారానికి తరలించారు పోలీసులు.

తెలుగుదేశం పార్టీ నేతలపై జగన్ రెడ్డి కక్షసాధింపు ఒక రేంజ్ లో ఉంది.  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ నేతలపై వరుస కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్కిల్ కేసు నమోదుకు ముందు.. మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూళ్ళిపాళ్ళ నరేంద్ర వంటివారిపై కేసులు పెట్టి జైలు పాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ తరువాత టీడీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగిస్తోంది. పాత కేసులను తిరగతోడి మరి కేసులు కట్టి టీడీపీ నేతలను కటకటాలపాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే కడప జిల్లా, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి అరెస్ట్ సంచలనంగా మారింది. 10 నెలల క్రితం నమోదు అయిన ఈ కేసును ఏదో పనిగట్టుకుని మరి రీ – ఓపెన్ చేసి.. రవిని అరెస్ట్  చేశారు పోలీసులు. కడపలో తెలుగుదేశానికి వస్తున్న ప్రజాధారణ చూడలేక రవిని ఇలా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇలా ఏపీలో విపక్షాలకు స్వేచ్ఛలేదు. ఏది ప్రశ్నించినా.. అరెస్ట్ చేసి గొంతునొక్కే ప్రయత్నం జరుగుతోందని ఇప్పటికే పొలిటికల్ విశ్లేషణలు ఊపందుకున్నాయి.