సెంటిమెంట్ పండుతుందా..? కంటోన్మెంట్ గెలుపు ఎవరిది..?

తెలంగాణ సాధారణ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, గెలుపును ఎంతో ఛాలెంజ్ గా తీసుకున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను ఖరారు చేసి.. జనరణ్యంలో ప్రచారంలో ముందుంటే.. కాంగ్రెస్, బీజేపీ లు ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 55 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించగా.. రెండు జాబితాలో మరో 45 మందిని శుక్రవారం ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రకటించిన 100 స్థానాల్లో దాదాపు గెలుపు కోసం పోరాడే హేమాహేమీలను బరిలోకి దించుతున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ప్రజా యుద్దనౌక గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలను కాంగ్రెస్ బరిలో నిలిపింది కాంగ్రెస్. ఈ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత ను బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. గద్దర్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ నుంచే ఈసారి ఎన్నికల బరిలో నిలిచేవాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మరో 4 స్థానాలను కమ్యూనిస్ట్ లకు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే కంటోన్మెంట్ స్థానం నుంచి బలమైన పోటీ తప్పదు అన్నట్లు తెలుస్తోంది. సర్వేలన్నీ ఇప్పటికే వెన్నెల గెలుపు లాంఛనమేగా అన్నట్లు వెల్లడిస్తున్నాయి. అంతకముందు గద్దర్ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తారా..? లేదా ..? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఆ మధ్య గద్దర్ బార్య విమల మీడియా సమావేశంలో తమకు కాంగ్రెస్ టికెట్ కేటాయించినా.., ఇవ్వకున్న తాము మాత్రం ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తామని స్పష్టం చేసింది. దీంతో కంటోన్మెంట్ స్థానంలో పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా ముందుస్తుగా గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్.

ఇకపోతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో ఉన్న లాస్య నందితకు వెన్నెల గట్టి పోటీ నివ్వనుంది. బీఆర్ఎస్ వ్యూహానికి ప్రతివ్యూహంగా మారిన వెన్నెల .. కంటోన్మెంట్ నుంచి గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే తండ్రి సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతోందో చూడాలి.