ఏపీలో జంగీల్ రాజ్ పాలన.. జంకుతున్న ఎన్నికల సంఘం..!

ఏపీలో ఆరాచకం రాజ్యమేలుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అటవీక సంప్రాదాయంవిశృంఖలంగా విభృజించడం.. యువతను, మేధావులను ఆలోచింపజేస్తోంది.

ఏపీలో జగన్ రెడ్డి పాలనలో ఈ నాలుగునరేళ్ళు.. ప్రజాకంఠ వ్యవస్ధను ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు.., దాడులు .., ఇంకా మాట వినకుంటే హత్యలు.. ఈ విధానాన్ని  ఏమనాలి..? అందుకేనేమో విపక్షాలు దీన్ని బీహార్ పాలన అంటారు. కాదు.. అంతకు మించి అంటారు ప్రజలు. ఇప్పు ఈ ధోరణి ప్రజలను, విపక్షాలను దాటుకుని రాజ్యాంగ స్వతంత్ర సంస్థల్లో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులపై వరకు ప్రభావం చూపుతోంది. కోర్టులకు, ఎన్నికల కమిషన్ కు ఉన్న స్వంతంత్ర హక్కులను సైతం కాలరాస్తున్న ఈ పాలనను చూసి ప్రజలు జంకుతున్నారు.

ఏపీ సచివాలయంలోని ఎన్నికల సంఘంలో విధులు నిర్తర్వించే ఉన్నతాధికారిపై ఒత్తిడి నెక్స్ట్ లెవల్ అన్న మాదిరిగా ఉన్నట్లు గడిచిన మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. సచివాలయంతా అన్ని శాఖల నుంచి వినిపిస్తున్న పెద్ద టాక్ ఇదే. నకిలీ ఓట్ల దందా నియంత్రణలో ప్రజలు, తెలుగు దేశం పార్టీ యాక్టీవ్ రోల్ పోషిస్తోంది. వరుసగా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలను కలిసి నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులు అందిస్తోంది. ప్రతి 10 వేల ఓట్లలో 1000 కి పైగా నకిలీ ఓట్లు నమోదు అవుతున్నాయని.., వాటిని కింది స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని.. సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ నుంచే ఆట మొదలైంది.

తెలుగుదేశం పార్టీ తో పాటు అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. జోరు డోర్ నెంబర్, ఒకే డోర్ నెంబర్, హోటళ్లు, టీ స్టాల్స్ డోర్ నెంబర్లతో నమోదు అవుతున్న దొంగ ఓట్లే విపక్షాల ఆరోపణలకు రుజువులు. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకేంటే తప్ప రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదు. ఆ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల, ఏలూరి సాంబశివరావులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. అనంతరంపురం జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, మార్టురు సీఐ ఫిరోజ్, పర్చూరు, యుద్దనపూడి, మార్టూరు ఎస్సైలు ప్రసాద్, కమలాకర్, అనూక్ లను విధులు నుంచి తొలగించింది ప్రభుత్వం.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకపోవడంతోనే కదా.. ఇలా కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టాల్సి వస్తోందని ఆరోపణలు, విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఓటరు జాబితా తయారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని రుజువులు చూపబట్టేగా ఇలా జిల్లా స్థాయి అధికారులతోపాటు పోలీసు అధికారులు సస్సెండ్ అయ్యింది..?.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వలనే కదా.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తోంది..? ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలు. కానీ మొంటి జగన్ రెడ్డి ప్రభుత్వం.. రౌడీ రాజకీయాలు చేసే వైసీపీకి ఇది పట్టడంలేదు. అందుకే ఏపీలో పతనమవుతున్న ప్రజాస్వామ్యాన్ని  ఆ దేవుడే  కాపాడాలని ప్రజలు కూడా ఓ నిర్ణయానికి వచ్చారు.