పేర్లు,రంగుల మార్పు రాజకీయంపై వివాదం..!

ఏపీలో రంగుల రాజ్యం రాజ్యమేలుతోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న పనులు చూసి.. కేంద్రంలోని పెద్దలు సైతం అవాక్కవుతున్నారు.

ఏపీలో జగన్ రెడ్డి నాలుగునరేళ్ళ పాలనలో చిత్ర విచిత్ర పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. ఆయన గద్దెనెక్కిన వేళ విశేషం ఏమిటో కానీ.., అన్నీ వర్గాల వారు రోడ్డుపడ్డారు.  నేనే సంక్షేమ ప్రధాతను అంటూ నవరత్నాలతో కలరింగ్ ఇచ్చే జగన్ .. ఏపీ ప్రజలను భిక్షగాళ్ళ కన్నా దారుణంగా మార్చారని విపక్షాల వాదన. ప్రజలకు.., ముఖ్యమంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇవన్నీ చాలవంటూ.. కేంద్ర నుంచి రావాల్సిన నిధులను సైతం జగన్ చేజేతులారా వదుకోవాల్సి పరిస్ధితి ఏర్పడింది.

ఇది కేవలం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ ల పేర్లను కేంద్ర పధకాలకు పెట్టడమే. తన పచ్చే తనకు ఆనందం అన్న లోకంలో బ్రతికే జగన్ కు ఇవేమీ తెలియదు. కేంద్ర నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో సాగించాల్సిన పథకాలకు తన పార్టీ రంగులు, తన సొంత పేర్లు పెట్టుకోవడంపై జగన్ పై కేంద్రం మండిపడుతోంది. పాలన తొలినాళ్ళల్లో సచివాలయాలు.., నాడు నేడు ద్వారా స్కూల్స్ కు వైసీపీ జెండా రంగులు వాడి కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. దీంతో రంగుల మార్పుకు అప్పట్లో దాదాపు 3 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే నేడు కేంద్ర పథకాలకు జగనన్న.., వైఎస్ఆర్ పేర్లు పెట్టడంతో కేంద్ర నుంచి రావాల్సిన దాదాపు 5 వేల 300 కోట్ల నిధులు ఆగిపోయాయి.

 రాష్ట్రంలో అమలు అవుతున్న 20 కు పైగా పథకాలకు జగనన్న పేరు, 55 పథకాలకు, కార్యక్రమాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో కేంద్రం నిధులు  ఆపేసింది. దీనిపై కేంద్రం అనేకమార్లు అభ్యంతరాలు చెప్పింది. హైకోర్టు కూడా మొట్టికాయాలు వేసింది. అయినా మొండి జగన్.. తన కుంటుంబ పేర్లు.., తన పార్టీ జెండాను ప్రచారం చేసుకునేందుకు వేల కోట్ల కేంద్రం నిధులను వదులుకోవాల్సి వస్తోంది. కేంద్ర పెద్దలు పలుమార్లు జగన్ చేస్తున్న పేర్లు, రంగుల మార్పులపై అభ్యంతరాలు తెలుపుతున్నా.. తీరులో మార్పు రావడం లేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన మూలధన వ్యయం కోసం కేంద్రం ఇచ్చే ప్రత్యేక సాయం ఆపేసింది.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన రూ. 4 వేల కోట్ల నిధులను నిలపివేసింది. కేంద్రంలో అమలు చేస్తున్న పీఎంఏవై-జీ గృహ నిర్మాణ పథకం పేరును జగన్ ప్రభుత్వం అలాగే కొనసాగించకుండా ఆ పథకానికి పీఎంవై-వైఎస్సాఆర్ అని పేరును తగిలించారు. దీంతో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1200 కోట్ల నిధులను కేంద్రం తొక్కి పట్టింది. ఇలా జగన్ చేస్తున్న అనాలోచిత నిర్ణయాలు, చర్యలు ఏపీ ప్రజలకు పాలిట శాపంగా మారింది.