ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న ఉత్కంఠ..!

చంద్రబాబు బెయిల్.. కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో తీర్పు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం వెలువడే తీర్పు కోసం సర్వత్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.  

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు జుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆయన తరుఫున న్యాయమూర్తులు బెయిల్.., రిమాండ్ రివ్యూ లపై పిటిషన్ దాఖలు చేయగా.. చంద్రబాబును మరోసారి కస్టడీకివ్వాలని సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని.., కష్టడీకి అనుమంతించాలంటూ కోరారు.

అయితే ఈ రోజు కూడా దాదాపు ఈ కేసులో రెండు గంటలకు పైగా వాదనలు వినపించనున్నారు ఇరు పక్షాల న్యాయవాదులు. అయితే కేసు వాయిదా పడితే .. చంద్రబాబు కస్టడీ రోజులు పెరిగే అవకాశం ఉంది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబు దోషి అని చెప్పే సరైనా ఆధారాలు  ఏవీ.. సీఐడీ వద్ద లేవు అన్నది కోర్టు గమనిస్తుందని తెలుస్తోంది.

ఇరు వాదనలు అనంతరం చంద్రబాబుకు ఈ రోజు బెయిల్ మంజూరు అవుతోందని తెలుగు దేశం పార్టీ నేతలు.., వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు భావిస్తున్నారు.