రేపే చంద్రబాబుకు బెయిల్.. అన్నీ ఏర్పాట్లు పూర్తి..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకురేపు బెయిల్ మంజూరు అవుతుందని తెలుగుదేశం పార్టీవర్గాలుఆశాభవం వ్యక్తం చేస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు  హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని  ఆయన తరుపున లాయర్లు,  పార్టీ వర్గాలు  ధీమా గా ఉన్నాయి.  ఈ కేసులో  ఇప్పటికే చంద్రబాబు  48 రోజులుగా  జైల్లో ఉన్నారు.  జుడిషిఎల్ ఖైదీగా ఉన్న చంద్రబాబును  అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు  ఆయన ఆరోగ్య రీత్యా కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జైలు అధికారులు చంద్రబాబు హెల్త్ నివేదికను బయటపెట్టకుండా దాస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

చంద్రబాబు హెల్త్ బులిటెన్   నివేదికను  బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న వేళ..  చంద్రబాబు  జైల్లో ప్రాణహాని ఉందని..,  తమ నాయకుడిని రక్షించుకునేందుకు  హైకోర్టు బెల్ మంజూరు చేయాలని  ఈనెల 19న  న్యాయవాదులు  హైకోర్టును ఆశ్రయించారు.  ఈ బెయిల్ పిటిషన్ ను  వెకేషన్ బెంచ్ కు  బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో దీన్ని విచారణను  వెకేషన్ బెంచ్  రేపు  విచారించి    తీర్పురు  వెలువడించనున్నది. అలానే చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్ డేటా అంశంపై నేడు విచారణ జరగనున్నది. సీఐడీ అధికారుల కాల్ డేటా భద్రపరచాలని కోరుతూ.. చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దీనికి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబి కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్ డేటా అంశంపై నేడు విచారణ జరగనున్నది. సీఐడీ అధికారుల కాల్ డేటా భద్రపరచాలని కోరుతూ.. చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దీనికి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబి కోర్టు ఆదేశించింది.