స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కోర్టుల్లో చంద్రబాబు వేసిన పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి.

తనపై అక్రమంగా రాజకీయ కుట్రతోనే కేసు నమోదు చేసి..జైల్లో వేశారని .. చట్టంలోని నిబంధనలేవి పాటించడకుండా తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. తన పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ కోరుతూ.. చంద్రబాబు తరుఫున న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు.

చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై ఈ నెల 3న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే.., అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రా లు వాదించగా.., సీఐడీ తరుఫున ముకుల్ రోహత్గీ.., రంజిత్ కుమార్ వాదనలు వినింపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు జస్టిస్ అనిరుద్దబోస్.., జస్టిస్ బేలా ఎం.త్రివేది లు కేసు విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ రోజు సుప్రీంలో జరిగే వాదనలకు సంబంధించిన లిస్ట్ లో చంద్రబాబు పిటిషన్ 59వ ఐటం కింద విచారణకు రానున్నది.

అయితే ప్రధానంగా 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సెక్షన్ ను అనుసరించి తిరిగి వాదనలు వినిపించనున్నారు చంద్రబాబు తరుఫున న్యాయవాదులు. చట్టం అమలు లోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ ఈ కేసును 2021 సెప్టెంబర్ 7న కేసు నమోదు చేసిందని ఆరోపణ. అయితే .. 17ఏ చట్టం రాకముందే ఈ కేసు విచారణ ప్రారంభమైందని.. అందుకే గవర్నర్ అనుమతి తీసుకోలేదని సీఐడీ తరుఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు.

మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ పై మూడు రోజుల వరుస వాదనలు విన్నతరువాత కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఇంకోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు.., అంగళ్లు.., ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్ లపై సోమవారం హైకోర్టు తీర్పులు ఇవ్వనుంది.