సెంట్రల్ జైలు నుంచి కేసీఆర్ కు అద్దిరిపోయే రిటర్న్ గిఫ్ట్..!

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఫుల్ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చాయి.

2014 రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి తెలంగాణలో ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుని పాలిస్తోంది. వరుసుగా 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీగా కేసీఆర్ పార్టీకి లోకల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మారుతున్న రాజకీయ నేపథ్యంలో ఎందుకో కేసీఆర్ వెనుకబడ్డాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఉద్యమాలే ఊపిరిగా మల్చుకుని.. తెలంగాణను సాధించిన నేత.. ఆ ఉద్యమకారుల చీత్కరాలకు గురైయ్యారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న నేత.. దళితులకు బంధువు పథకంతో చేతులు దూలుపుకున్నారు. మూడెకరాల భూమి.., తెలంగాణ ఉద్యమ కారులకు ఉద్యోగాలు.., రాజకీయ అవకాశాలు.., ఇలా చెప్పుకుంటూ పోతే గంపెడు హామీలు కుమ్మరించి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఆయాస పడుతున్నారన్నది వాస్తవం.

రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చి హామీలు.., స్థానికంగా నెలకొన్న రాజకీయ సమస్యలు మినహాయిస్తే.. ఏపీలో తన పైఎత్తు పావును కదిపారు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ కు తెర వెనకున్న పాత్రలలో కేసీఆర్ దే ప్రధాన పాత్ర అని విశ్లేషణలు లేకపోలేదు. ఎందుకంటే బాబు అరెస్ట్  కు ముందు చంద్రబాబు మీడియా ముఖంగా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో తాము 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన నెల రోజులు గడవకమునిపే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు.

ఇది యాథృచ్ఛికమే కావచ్చు. కానీ మంత్రి కేటీఆర్ ఇక్కడున్న సెటిలర్స్ ను ఉద్దేసించి.. నోరు జారాడు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపుతాం అంటూ కౌంటర్స్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ లో కొంత డైలామా పరిస్ధితి నెలకొంది. మరో వైపు సర్వేలన్నీ కేసీఆర్ ఘోర పరాజయం తప్పద అని కోడై కూస్తున్న వేళ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. మరోవైపు 32 స్థానాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ తో అభ్యర్ధుల ప్రకటనతో కొంత వెనుకబడి ఉన్న తెలుగుదేశం కూడా అభ్యర్ధుల జాబితాను కట్టుదిట్టంగా ప్రకటించేందుకు కరసత్తు జరుగుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అన్నీ స్థానాల్లో పోటీ చేసి..,జనసేన కూడా ఆ 32 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను దించితే.. చీలే ఓట్లన్నీ బీఆర్ఎస్ వే అన్నది విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కు గండి కొడితే.. కాంగ్రెస్ గెలుపు సూనాయాసమేనని ఇప్పటికే అంచనాకొచ్చారు. గెలుపు కోసం కేసీఆర్ పన్నిన గేమ్ ప్లాన్ ఆయనకే రివర్స్ గేమ్ ప్లే అయినట్లు అన్నీ రాజకీయ పార్టీలు సిద్ధమైన వేళ.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కేసీఆర్ కు మాంచి రిటర్న్ గిఫ్ట్ అందించారు చంద్రబాబు అని సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు రాసుకొస్తున్నారు.