జైల్లో  దిగుజారుతున్న చంద్రబాబు ఆరోగ్యం..!

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. గడిచిన రెండు రోజులుగా చంద్రబాబు తరుచు అస్వస్థతకు గురవుతున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  అరెస్టై గత 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆయన తరుచు అస్వస్ధతకు గురవుతున్నారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులతోపాటు పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నెల రోజులు దాటినా చంద్రబాబు ఎప్పుడు బయటకొస్తాడన్న క్లారిటీ ఉండటం లేదు.

ప్రధానంగా జైల్లో చంద్రబాబుకు తరుచు డిహైడ్రేషన్ భారీనపడుతున్నారు. రాజమండ్రిలో పెరిగి న ఉష్టోగ్రతలు.. జైలు గోడలు మధ్య చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికి తోడు చర్మపై దద్దర్లు రావడం కొంచెం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి రాజమండ్రిలోని చర్మ వ్యాధి వైద్య నిపుణులు ఆయనను పరీక్షించి.. జైలు అధికారులకు కొన్ని మందులు సూచించారు. బరువు కూడా అమాంతం తగ్గిపోయారు. ఇప్పడే ఇదే పార్టీని కలవపెడుతోంది. 73 ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో ఇంకా బరువు తగ్గడం జరిగితే మరిన్నీ అనారోగ్య సమస్యలు తలెత్తే సమస్యలు లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో శుక్రవారంతో సుప్రీంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. అలా వాదనలు ముగిస్తే.. మధ్యాహ్నానికి సుప్రీం తీర్పును వెలువడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాదనల మెరిట్స్ ను బట్టి చూస్తే చంద్రబాబుకు అనుకూల వాతావరణం ఉంది. దీంతో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ అవుతోందన్న ఆశాభావం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.