బిగ్ బ్రేకింగ్ .. చంద్రబాబుకు తీవ్ర అస్వస్థత..!

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజమండ్రి జైల్లో తీవ్ర  అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మగళవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు 32 రోజులు కావస్తుంది.

ఈ క్రమంలో ఏపీలో గత నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. జైల్లో సరైన ఎయిర్ కండీషన్స్ లేకపోవడంతో ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురైయ్యారు. ఉక్కపోతల విషయాన్ని  చంద్రబాబు జైలు అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని ములాఖత్  సమయంలో కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

అయితే జైల్లో చంద్రబాబుకు రక్షణ లేదని ఎప్పటి నుంచో టీడీపీ నాయకులు, న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని తరుచు ఆందోళనలు వ్యక్తమవుతునే ఉన్నాయి. సుప్రీంలో క్వాష్ పిటిషన్ శుక్రవారం వాయిదా పడటంతో బాబు బయటకు వచ్చేందకు ఇంకా మరిన్ని రోజులు పట్టేలా ఉంది.

అదే జరిగితే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించి.. తీవ్ర అనారోగ్యం భారిన పడతాడని తెలుగుదేశం పార్టీ.., కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే చంద్రబాబును జైల్లో చికిత్స అందిస్తారా..? లేక ప్రైవేటు హాస్పటల్ కు తరలిస్తారా..? అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.