చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి విషమం..ఆసుపత్రికి తరలింపు..!

చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు జైలు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత 36 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం పరిస్ధితి ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ములాకత్ అయిన కుటుంబం సభ్యులు ఆయన ధీనస్ధితిని చూసి కంగారు పడిపోతున్నారు. తెలుగు దేశం పార్టీ సీనియర్లు కూడా పెద్దఎత్తున ఆందోళన బాటపట్టారు. నిన్న (శుక్రవారం)  రాజమండ్రి జైల్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు విజయవాడ నుంచి కొంతమంది సీనియర్ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఏదో దాస్తున్నారని.., ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బుద్దా వెంకన్న.., మాణిక్యాలరావులు ముఖ్యమంత్రిని కలిసి చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిని వివరించేందుకు ప్రయత్నించగా.. వారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును జైల్లో హత్య చేయడానికి ఎక్కవ మెతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. బరువు 5 కేజీలు తగ్గి అనేక చర్మ సమస్యలతో బాధపడుతున్నారని.., మరో 2 కేజీలు తగ్గితే ఆయన కిడ్నీలు పాడైయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించింది. డీహైడ్రేషన్ భారీన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు చికిత్స చేస్తున్న వైద్య రిపోర్టులు బయటపెట్టమని కోరుతున్నా.. జైల్ అధికారులు గోప్యత పాటిస్తున్నారని చెప్పారు.

ఇదిలా ఉంటే రాత్రి చంద్రబాబు ఆరోగ్యం పరిస్ధితి ప్రమాదపు అంచుకు చేరడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో గదిని ఆయన చికిత్స కోసం అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం అర్థరాత్రి సర్వజనాసుపత్రిలోని వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా క్లినింగ్ ప్రక్రియ ప్రారంభించి.., సిద్ధం చేస్తున్నారు. గదిలో ఆక్సిజన్, ఈసీజీ మిషన్, వెంటిలేటర్ వంటి పరికరాలు, మందులను సిద్ధం చేస్తున్నారు.

 అంతేకాక ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యులతోపాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఆగమేఘాలపై ఆసుపత్రిలోని వీఐపీ గదిని సిద్ధం చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తరువాతే ఆసుపత్రికి తరలిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.