చంద్రబాబుకు ప్రధాన బెయిల్ పై ఉత్కంఠ..!

స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హైకోర్టు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనున్నది.

స్కిల్ కేసులో నిందులుగా ఉన్న వారందరికీ ఇప్పటికే ప్రధాన బెయిల్ పొంది ఉండగా.. చంద్రబాబుకు మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో అనేక అనుమాలకు తావిస్తున్నాయి. ఈ కేసు చంద్రబాబు 37వ నిందితుడైన చంద్రబాబుకి బెయిల్ దక్కపోవడంపై న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ కేసులో ఎ1 గా ఉన్న  నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ గంటా సుబ్బారావుతో పాటు కేసులో ఉన్న మిగిలిన నిందుతులకు ఇప్పటికే బెయిల్ పొందారు. సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ గా పనిచేసిన భాస్కర్ కు సైతం సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు  చేసింది. అలానే కేసులో 35వ నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి అపర్ణకు సైతం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ సంస్ధలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే ఈ కేసులో ఉన్న నిందులకు దిగువ, హైకోర్టు, సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది.

కానీ చంద్రబాబుకు మాత్రం ఈ కేసులో ఊరట లబించకపోవడం అపలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో తీర్పు రిజర్వులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని దీపావళి సెలవులు ముగిసిన వెంటనే తీర్పునిస్తామని వెల్లడించింది ధర్మాసనం. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీంలో ముందస్తు బెయిల్ ను పిటిషన్ ను  ఈ నెల 30 కు వాయిదా పడింది.