చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి విషమం..! తిరుపతి టూర్ రద్దు..!

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 53 రోజుల తరువాత మధ్యంతర బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైయ్యారు.

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబుకు జైల్లో తీవ్ర అనారోగ్యం భారీన పడ్డారు. దాదాపు 5 కేజీల బరువు తగ్గిపోయి.., డీహైడ్రేషన్ భారీన పడ్డారు. చర్మ సంబంధిత, మూత్రాశయం సమస్యలు, కంటి ఆపరేషన్ వంటివి జైల్లో బాబును వేధించాయి. దీంతో స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరుఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

దీనిపై పూర్తి వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. వేలాది మందిగా కార్యకర్తలు, అభిమానులు జైలు వద్దకు తరలివచ్చి.. చందబాబుకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో చంద్రబాబు విజయవాడ నివాసానికి బయలుదేరారు.

ఈ క్రమంలో మార్గ మధ్యలో తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవున పెద్ద సంఖ్యలో అభిమానులు చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై పూల వర్షం కురిపించి.. అభిమానాన్ని చాటుకున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు కుటుంబ సమేతంగా రేపు స్వామి వారి దర్శనార్ధం తిరుమల వెళ్లాల్సి ఉంది.

అయితే ఆయన ఆరోగ్య పరిస్ధితి మరి క్షీణించడంతో హైదరాబాద్ బయలుదేరాల్సిందిగా వైద్యులు సూచించారు. వెంటనే వచ్చి..తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరారు. దీంతో కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనను తాత్కాలికంగా విరమించుకుని వైద్య చికిత్స నిమిత్తం చంద్రబాబు నేరుగా హైదరాబాద్ లోని పర్సనల్ వైద్యులను చంద్రబాబు కలవనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం.., చంద్రబాబుకు అత్యవసర చికిత్సను అందజేయనున్నారు వైద్యులు.