charmy kaur, Puri Connects : మమ్మల్ని బతకనీయండి..సోష‌ల్ మీడియాకు బై బై చెప్పేసిన ఛార్మి..ట్రోలింగ్ ఎఫెక్ట్ – charmy kaur and puri connects took break from social media


Authored by Thummala Mohan | Samayam TeluguUpdated: Sep 4, 2022, 12:59 PM

Vijay Deverakonda – Liger : ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్న‌ట్లు త‌యారైంది పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh).. ఛార్మి (Charmy Kaur) ప‌రిస్థితి. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లై డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ ట్రోలింగ్ బాధ త‌ట్టుకోలేక‌నో.. పొయిన చోటే వెతుక్కోవాల‌నే క‌సి ఏమో కానీ.. పూరి క‌నెక్ట్స్ (Puri Connects)టీమ్ సోష‌ల్ మీడియాకు బై బై చెప్పేసింది. ఈ విష‌యాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా..

 

Charmy Kaur
ఛార్మి కౌర్
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్న‌ట్లు త‌యారైంది పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh).. ఛార్మి (Charmy Kaur) ప‌రిస్థితి. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఛార్మి, క‌రణ్ జోహార్‌ (Karan Johar), అజ‌య్ మెహ‌తా, హీరూ మెహ‌తాల‌తో క‌లిసి నిర్మించిన చిత్రం ‘లైగర్’ (Liger). విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లైంది. సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమా పోతే పోయింది కానీ.. విమ‌ర్శ‌లు మాత్రం మామూలుగా ఎదురు కాలేదు. నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో లైగ‌ర్ సినిమాను ట్రోల్ చేశారు. ఇక డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ టేకింగ్‌ను త‌ప్పు పట్టారు. మీమ్స్‌తో రెచ్చిపోయారు. ఇంకా సినిమాపై ట్రోలింగ్ ఆగ‌లేదు.

ఈ ట్రోలింగ్ బాధ త‌ట్టుకోలేక‌నో.. పొయిన చోటే వెతుక్కోవాల‌నే క‌సి ఏమో కానీ.. పూరి క‌నెక్ట్స్ (Puri Connects)టీమ్ సోష‌ల్ మీడియాకు బై బై చెప్పేసింది. ఈ విష‌యాన్ని ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ట్వీట్ చేసింది. ‘‘చిల్ గయ్స్.. బ్రేక్ తీసుకుంటున్నాం. పూరి కనెక్ట్స్ మళ్లీ ఇంకా మంచి పెద్ద ప్రాజెక్ట్‌తో బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంత వరకు మీరు బ్రతకండి మమ్మల్ని బతకనీయండి’’ అని తన మెసేజ్ ద్వారా ట్వీట్ చేశారు ఛార్మి.

ఛార్మి అండ్ టీమ్ ఇంతటి నిర్ణ‌యం తీసుకోవ‌టానికి కార‌ణం.. రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి, ఛార్మి చేస్తోన్న JGM సినిమా ఆగిపోయింద‌నే వార్త‌లు బ‌య‌ట‌కు రావ‌ట‌మేన‌ని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌. లైగ‌ర్‌తో పాటు JGM సినిమాపై కూడా నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేయ‌ట‌మే ఛార్మి నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ట‌.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.