చిరు156వ చిత్రం పట్టాలెక్కనున్నది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్నఈ చిత్రం శ్రీవశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రానికి  సంబంధించి పూజా కార్యక్రమాన్ని నిన్న విజయదశమి నాడు చిత్ర యూనిట్ జరుపుకుంది. ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రత్యేక సెట్స్  వేశారు చిత్రం యూనిట్. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ  చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే  ఈ టైటిల్ ను అధికారికంగా ఖరారు  చేయలేదు. అయితే చిత్రంలో ప్రతి నాయకుడి క్యారెక్టర్ పవర్ ఫుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ ప్రతి నాయకుడిగా ఈ చిత్రంలో రానా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బింబిసారా చిత్రం దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించగా.. ఈ పాన్ ఇండియా మూవీని యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మిస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. అయితే చిత్రానికి సంబంధించిన తారాగణం డిటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.