కేసుల మీద కేసులు.. కుట్రలు రక్తికట్టేనా..?

కేసుల మీద కేసులు కడుతూ.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను జీవితాంతం జైల్లో ఉంచాలనే జగన్ నిర్ణయంగా ఉందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన తొలినాళ్ళల్లోనే ఆయన పై మరో రెండు కేసులు నమోదు చేస్తూ కోర్టులో పీటీ వారెంట్ ను వేశారు. చిత్తూరు జిల్లా అంగళ్ళల్లో చంద్రబాబు ప్రమేయంతోనే తెలుగు దేశం శ్రేణులు రెచ్చిపోయారని అభియోగంమోపుతూ కేసు నమోదు చేశారు.

అలానే ఫైబర్ గ్రిడ్ లో అవకతవకలు జరిగాయని.., ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ ను అనుయాయులకు లబ్ధి చేకూరిలే మార్చారని మరో రెండు కేసులను సీఐడీ నమోదు చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుపై మరో కేసును సోమవారం నమోదు చేసింది. మద్యం తయారీ కంపెనీలకు నిబంధనలు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఎఫ్ఆర్ఐను ఫైల్ చేశారు. సీఐడీ ఫైల్ చేసిన కేసును నేడు విచారిస్తానని జడ్జీ చెప్పారు.  

మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పును హైకోర్టు నిన్న (సోమవారం) రిజర్వు చేసింది. నేడు ఆ తీర్పును హై కోర్టు వెలువడించనున్నది. స్కిల్ డెవల్మెంట్  కేసును నమోదు చేసిన 21 నెలలు తరువాత చంద్రబాబును అరెస్ట్ చేయడం.., సుదీర్ఘ కాలం కేసు స్టడీ చేస్తున్న సీఐడీ నేటికీ ఒక్క సాక్ష్యాన్ని సంపాదించలేకపోవడం గమనార్హం. మని ట్రైల్, ఇతర సాక్ష్యాలను సేకరించడం వంటివాటిలో సీఐడీ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. సాక్ష్యాలు లేని కేసులు, 17ఏ నిబంధనను పాటించకపోవడం వంటివి చంద్రబాబు కేసుల విషయంలో జరుగుతున్న అతిపెద్ద తప్పులు  అని సోషల్ మీడియాలో విశ్లేషణలు పెద్దఎత్తున సాగుతున్నాయి. వీవీఐపీలుగా ఉన్న ప్రజా ప్రతినిధులు సమయాన్ని వృద్థా చేయడం, అత్యంత విలువైన కోర్టు సమయాన్ని సైతం స్వార్థప్రయోజనాలకు వెచ్చిచడం వంటివి ఘోర తప్పిదాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.