రాళ్ళతో దద్దరిల్లిన గాంధీ భవన్.. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దగ్థం..!

తెలంగాణ ఎన్నికలకు టైం దగ్గరపడేకొద్ది ప్రధాన పార్టీలో సీట్ల పంపకం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీట్ల సద్దుపాటు విషయం పెద్దఎత్తున ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

2023 నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న సాధారణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ఉన్నఫలంగా మనసు మార్చుకుని పార్టీ కండువాలను మార్చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విపక్షాల మాజీలు.., ముఖ్య నేతలు నచ్చిన పార్టీలోకి జంపింగ్ జపాంగ్ లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా పెద్దఎత్తున్న వివాదాలకు తెరతీస్తున్నాయి.

జూబ్లిహిల్స్ టికెట్  అశించిన భంగపడ్డ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ టికెట్ ను మాజీ క్రికెటర్,సీనియర్ నేత అజారుద్దీన్ కు కేటాయించింది అధిష్టానం. దీంతో విష్టువర్ధన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం వారందరూ గాంధీ భవన్ వైపు సాగారు.

గాంధీ భవన్ ముట్టడించారు. అనంతరం  కాంగ్రెస్ కండువాలను తగలపెట్టారు. గాంధీ భవన్ పై ఇటుకలతో దాడి దిగారు. రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న ప్లాస్టిక్ బోర్టును కూడా ధ్వసం  చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీట్లను కోట్లుక అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఓల్డ్ సిటీ లో కూడా నాన్ ముస్లీంకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన అబ్ధుల్లా సోహైల్ పార్టీకి రాజీనామా చేశారు.