దొరల తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణ రావాలి..!

తెలంగాణలో సాధరణ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రను ములుగు నుంచి ప్రారంభించింది. ఈ యాత్రను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు ప్రారంభించారు. ములుగు రామప్ప ఆలయం నుంచి ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ శంఖరావం పూరించింది. ఈ యాత్రకు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామాంజపురంలో కాంగ్రెస్ సభ లో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీ ఓటు వేసినట్లేనని .. గ్యారెంటీ పథకాలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని రాహుల్ అన్నారు. తెలంగాణలో ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు పాలన సాగడంలేదని ఈ సారి ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య జరగబోతున్నాయని రాహుల్ ప్రస్తావించారు.

అందరికీ ఉద్యోగాలు ఏం అయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజలతోపాటు నిరుద్యోగులను మోసం చేశారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు ప్రియాంకగాంధీ కూడా కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రియాంక పిలుపునిచ్చారు. సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని.., కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి తెలంగాణ ఆడబిడ్డ పెళ్లికి లక్షల రూపాయలు నగదు తోపాటు తులం బంగారం ఇస్తామని ప్రియాంక వివరించారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో విజయభేరి యాత్ర ఫుల్ జోష్ ను నింపనున్నట్లు శ్రేణులు భావిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ళ ఎంతో సెంటిమెంటో ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే ఫార్మూలను ములుగు నుంచి షురూ చేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదీ ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలు చెబుతుంటే.. రాహుల్, ప్రియాంకల పర్యటన నూతన ఉత్సాహాన్ని నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.