నేటి నుంచి ప్రపంచ క్రికెట్ సమరం..!

క్రికెట్ ప్రేమికులకు ప్రపంచ కప్ పండుగ మొదలైంది. గురువారం నుంచి ఆహ్మదాబాద్ వేదికగా సాగే వరల్డ్ కప్ -2023 లో తొలుత ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ లు తలపడనున్నాయి.

నాలుగేండ్లకోసారి వచ్చే క్రికెట్ ప్రపంచ కప్ పండుగ రానే వచ్చింది. అతిథ్య భారత్ లో నిర్వహించనున్న క్రికెట్ సమరంలో టైటిల్ విన్నర్ గా నిలిచి కప్ కైవసం చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విలూరుతోంది. ఇప్పటికే వామ్ ఆప్ మ్యాచ్ లో జట్టు ఫిట్నెస్ పై ఒక అంచనాకు వచ్చింది ఇండియా.  

ఎలాగైనా ఈ సారి కప్ కొట్టాలని రోహిత్ సేనా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న వేళ.. తొలి మ్యాచ్ ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ఆడనున్నది. ఆ తరువాత 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలబడనున్నది భారత్. నవంబర్ 19 వరకు సాగే ప్రపంచ క్రికెట్ పోరులో భారత్ తో పాటు అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

అయితే ఇప్పటి వరకు 1987,1996,2011 సహచర దేశాలతో కలిసి అతిథ్యమిచ్చిన భారత్ ఈ సారి ఒంటరిగా మెగా టోర్ని నిర్వహించడం గమన్హారం. టోర్ని మొత్తంగా 10 జట్లు ఆడుతుండగా.. 45 రోజులు 48 మ్యాచ్ లు భారత్ లోని వివిధ వేదికలపై తలపడనున్నాయి.