ఓటమి భయంతోనే నీచ రాజకీయాలు.. బలిపీఠంపై పోలీసులు..!

ఏపీలో రాజకీయాలు పతాక స్థాయిలో దయనీయ స్ధితికి దిగజారిపోతున్నాయి. పాలకుల అధికార దాహానికి అధికారులు.., ముఖ్యంగా పోలీసులు బలి పశువులుగా మారుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ అత్యంత దారుణమైన.., నీచమైన చర్యలకు దిగుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సంక్షేమ పథకాలను నవరత్నాలుగా మార్చి .. పేదల సీఎం గా చెప్పుకుని జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. నిత్యం అదే పనిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరాజయం జపం చేస్తూ.. కుట్రలు.., కుయుక్తులు పన్ని వచ్చే ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ అధికారులను సైతం బలిపీఠంపై బలిపశువులుగా మారుతున్నారు.

సంక్షేమాలు పెద్ద ఎత్తున ప్రజలకు అందించి.. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంతోపాటు పారిశ్రామీకరణ.., ఉద్యోగ, ఉపాధి అంశాలపై దార్శినికత కలిగిన ముఖ్యమంత్రి గా ఊదరగొట్టే జగన్ రెడ్డికి అసలు ఈ ఓటమి భయం ఎందుకు..? కావాలని పని గట్టుకుని ఫాం -7 ద్వారా టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ఎందుకు..? అనుకూలమైన వ్యక్తుల ఓట్లను నకిలీ ఓట్ల రూపంలో చేర్చడం ఎందుకు..? జీవో డోర్ నెంబర్లు క్రియేట్ చేసి.. వందలు.., వేలు ఓట్లు చేర్చడం ఎందుకు..? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆ మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో దాదాపు 8 వేల నకిలీ ఓట్లు.., కొన్ని వేల సంఖ్యలో ఓట్ల తొలగింపు ప్రక్రియ అడ్డదారులో మొదలుపెట్టిన అధికారిపై టీడీపీ స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల చెంప చెల్లుమనిపించారు. నకిలీ ఓట్లు, తొలగింపు పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంప్రదిస్తే స్పందచలేదు. దీంతో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపు తట్టారు. దీంతో విచారణ చేపట్టిన సీఈసీ .. అనంతరపురం జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇదే తరహాలో బాపట్ల జిల్లా పర్చూరు లో నకిలీ ఓట్ల చేర్పు.., టీడీపీ,జనసేన ఓట్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ నీచ సంస్కృతిలో సాక్ష్యాత్తు ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, ఒక బిల్వో లు పాల్గొనడం విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికల వేళ కేవలం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే పాత్ర పోషించే పోలీసులు కూడా చివరికి ఇటువంటి నీచ కార్యాలకు తెరతీయడం నిజంగా దురదృష్టకరం.

పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాద మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా విచారణకు ఆదేశించారు. వాట్సప్ చాట్ ద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారని.. ఇందులో మార్టురు సీఐ ఫిరోజ్,పర్చూరు ఎస్సై ప్రసాద్, యద్దనపూడి ఎస్సై కమలాకర్, మార్టూరు ఎస్సై అనూక్ లు ప్రత్యక్షంగా ఇన్వాల్ అయినట్లు తెలింది.

దీంతో వీరిని సస్పెండ్ చేస్తూ..ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.  ఇందులో భాగస్వామిగా ఉన్న మహిళా బీల్వో కూడా సస్పెండ్ చేసింది. అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు ప్రక్రియలో అధికారులతో పాటు పోలీసులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.