సీనియర్లంతా సీఎంలేనా..? మీరు మారారా..?

తెలంగాణ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి రాజకీయలు ఎత్తుకు పైఎత్తు ఆటలో బీజీబీజీగా ఉన్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది ఎన్నికల సమయం. ఈ సమయం అన్నీ రాజకీయ పార్టీలకు ఎంతో కీలకంగా వ్యవహరించాల్సిందే. ఎంత బాధ్యతగా పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే.. గెలుపు సునాయాసమవుతోంది. ఇటువంటి పరిస్ధితి నెలకొన్న సమయంలో కాంగ్రెస్ లో పాత కాలం కంపు ఇంకా గుభాళిస్తూనే ఉంది. ఒక రాజ్యం కూలిపోవడానికి సైనికులు మాత్రమే కారణం కాదు.. రాజే. రాజే అష్ట దరిద్రుడైతే ఆ రాజ్యం మనగలగడం సాధ్యకాదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతిసారి చేసే తప్పులు ఇటువంటివేనని ఈ సామెత అందిరికీ గుర్తుకు వస్తాయి. పట్టుమని నెల రోజుల్లో కూడా లేని ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ ప్రచారం ముందుకు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం కసరత్తు……… పేరుతో కాలయాపన చేస్తోంది. ఇదే కేడర్ తలలు పట్టుకుంటున్న పెద్ద సమస్య.

నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరు అన్న ప్రశ్నకు కాంగ్రెస్ ఇంకా సమాధానం చెప్పల్లేని పరిస్ధితిలో ఉంది. ఎవరికీ వారు సీటు నాదంటే..నాది.. అంటూ భ్రమల్లో కేడర్ ను మభ్యపెడుతున్నారు. అధికారికంగా నేటి వరకు సీనియర్లు మినహాయించి.. ఇంత వరకు ఒక్కరికీ కూడా సీటు కేటాయించని పరిస్ధితి. మరి ఇలా ఉంటే బలంగా ఉన్న బీఆర్ఎస్ ను ఢీకొట్టడం మీ తరమేనా..? అన్న వాదనలు కూడా లేకపోలేదు. మరోవైపు సీనియర్లంతా.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్ధంటే.. నేనే ఆ అభ్యర్ధిని అంటూ చెప్పుకు తిరుగుతున్నారే కానీ.. తెలంగాణ పదేళ్ళుగా చచ్చిపోయిన పార్టీని బ్రతికించి.. ముందుకు తీసుకుపోతే భవిష్యత్తుంటది అన్న భావన ఆ పార్టీలోని ఏ సీనియర్ ఆలోచించడం లేదు అన్నది వాస్తవం.

చేసిన కరసత్తు చాలు.. సీట్లు డిక్లేర్ చేస్తే ప్రచారం చేసుకుంటూ బీఆర్ఎస్ తో సమానంగా పోటీ పడి.. కేసీఆర్ ను ఇంటికి పంపుదాం అన్న ఉత్సాహం కేడర్ నుంచి తరుచూ వినిపిస్తున్నా.. నేతల మాత్రం మొగుడు చచ్చిన పెళ్లాంలా ఏడుపుగొట్టు మోహాలేసుకుని సన్నాసుల్లా నాలుగు గోడల మధ్య శిథిలమవుతున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అయితే ముచ్చటంగా మూడోసారి కూడా కేసీఆర్ చేతిలో ఘోర పరాజయం చవిచూడక తప్పదన్న సంకేతాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి కూడా. భూటకపు సర్వేలు చెప్పేది పక్కన పెట్టి.. భవిష్యత్తును కని.. మారండి..పార్టీని ప్రచారం దిశగా నడిపించి పరాజయం నుంచి భయటపడండి అంటూ సోషల్ మీడియాలో పార్టీ సానుభూతిపరులు హెచ్చరిస్తున్నారు.