ఉచితాలకే పెద్దపీట.. ఐదు రాష్ట్రాల్లో హామీల పర్వం..!

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా చెప్పే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాజకీయ పార్టీలు ఉచితాలకు పెద్దపీట వేస్తూ.. ఓటర్లును ఆకర్షిస్తున్నారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే మధ్యప్రదేశ్ తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో లేదు. మధ్యప్రదేశ్ లో కూడా అధికారాన్ని లాక్కోవడం ద్వారా గతంలో ఆ పాలనను చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది.

గెలుపే లక్ష్యంగా కేవలం మధ్యప్రదేశ్ లో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ తో సమానంగా ఉచిత హామీలను కుమ్మరిస్తోంది. పోటాపోటీగా కాంగ్రెస్.., బీజేపీలు ఓటర్లును ఆకర్షించే హామీలతో ఉచితాలను ప్రకటిస్తున్నారు. దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీలపై ఒంటికాలపై లేచే మోదీ ప్రభుత్వం.., ఉచితాలకు తాము వ్యతిరేకం అన్న కలరింగ్ ఇచ్చే బీజేపీ ఇప్పుడు ఆ ఉచితాలకే పెద్దపీట వేయడం విడ్డూరంగా మారింది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల వేళ.. మ్యానిఫెస్టోలో పెద్దఎత్తున సంక్షేమాల పథకాలకు నగదు ఖర్చు చేస్తామని హామీలిచ్చి.. వాటిని నెరవేర్చేందుకు శాయశక్తుల కృషి చేస్తుంటాయి. ఆ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీల పాట్లును ఎద్దేవా చేసిన ఘటనలు.., వాటి అమలకు నిధులివ్వకుండా ముఖ్యమంత్రులను ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయించిన సందర్భాలు కోకొల్లలు.

అయితే ఈ సారి మధ్యప్రదేశ్ లో ఆప్, సమాజ్ వాది పార్టీ లు కూడా బరిలో నిలిచి.. సీట్లు కొట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బలంగా ఉన్న మధ్యప్రదేశ్ లో ఆప్, ఎస్పీలు బరిలో ఉండడంతో గట్టిపోటీ తప్పదని భావించి బీజేపీ.. తాయిలాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమాలు ప్రకటించి.., తిరిగి అధికారాన్ని చేక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అధికారమే లక్ష్యంగా సాగే బీజేపీ.. ఏం చేసైనా సరే.., ఎంత డబ్బు కుమ్మరించైనా సరే పాలన పగ్గాలను చేపట్టాలని ప్రకటిస్తున్న ఉచితాలు ప్రగతి కాముల నోట విమర్శల పాలౌతోంది. సంక్షేమం మాటునా వ్యక్తి సామాజీకాభివృద్ధి దాగి ఉంటే సరిపొద్దికానీ.., ఉచితాలను నగదు రూపంలో నేరుగా పబ్లిక్ అకౌంట్ కు బటన్ నొక్కడం వంటివి వారిని సోమరులను చేయడం తప్ప వేరేది ఉండదన్నది అందరికీ తెలిసిందే. చివరికి బీజేపీ కూడా అదే బాట పట్టడం ఢిల్లీ పీటాన్ని ప్రశ్నించడమేనని వాదనలు లేకపోలేదు.