హుజురాబాద్ కమలంలో కలవరం..!

ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ లో బీజేపీ శ్రేణులు రివర్స్ గేర్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఉద్యమనేత.., సీనియర్ నాయకుల, ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ లో బీజేపీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ఎన్నికల వేళ.. ఈ నియోజకవర్గం నుంచి వందాలది మంది అనుచరులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు .. బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సమాయక్తమవుతున్నారు.

హుజురాబాద్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగుతుండగా.. మరోపక్క బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరులు,బీజేపీ యువ నాయకులు జమ్మిగుంట అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశామని అయినప్పటికీ తమను ఆయన పట్టించుకోవడం లేదన్న విసుగుతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన దాదాపు 100 మంది బీజేపీ పార్టికీ నిన్న రాజీనామా చేశారు.

బీజేపీకి రాజీనామా చేసిన వారంతా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో గులాబి కండువా కప్పుకోనున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గంలో ఈటెల ప్రధాన అనుచరవర్గమే ఇలా బీజేపీకి రాజనామా చేసి బయటకొస్తుంటే.. పార్టీలో ఉన్న పాత తరం బీజేపీ నేతలు నడుస్తున్న నాయకత్వంపై సంశయంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.