చేవ చచ్చిన హీరోలు.. జీవితాంత జీరోలేనా..?

టాలీవుడ్ లో అగ్ర కథనాయకులు దగ్గర నుంచి.. చిన్న స్థాయి హీరోలు వరకు అందరూ దైనందిన జీవితంలో జీరోలే అని మరోసారి నిరూపించుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

సినిమాల్లో పెద్దపెద్ద పవర్ ఫుల్ డైలాగ్స్ తో..మీసాలు మెలేస్తారు.. తొడలు సైతం చరిచి.. కత్తులు దూస్తారు. అబ్బా.. మా హీరో ఫైట్లు.., వాడిలో రోషం అచ్చం ఆయనాలానే మేం ఆదర్శంగా  సామాజీకంగా ఎదగాలని అనుకుంటారు అభిమానులు. కానీ.. అది సినిమా.. ఇది జీవితం. కానీ హీరో అన్న తరువాత సమాజంలో జరిగే అన్ని సమస్యలకు పెద్దగా స్పందించాల్సిన పనిలేదు. అలా స్పందిస్తే మీకు కూడా అన్న ఎన్టీఆర్ లాగే సీఎం అవుతారు. అది పక్కనపెడితే.. సాటి సినిమా వాళ్ళకు.. చిత్ర పరిశ్రమకు చెందిన వారికి కష్టం వచ్చినప్పుడైనా కనీసం స్పందించాలి. జరుగుతున్న అన్యాయం ప్రశ్నించకున్నా పర్వలేదు… వారికీ బాసటగా నిలబడేలా స్పందించాలి. కానీ ఆ ధైర్యం టాలీవుడ్ హీరోలు…, పెద్దల్లో కనుమరుగవుతోంది. ఇది నిన్నటితో సో క్లియర్.

హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ మనగడకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు వేసిన బీజమే ఈనాటి నవరసాలు పండిస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకున్నారు మన దర్శక నిర్మాతలు, హీరోలు. కానీ.. ఆయన అరెస్ట్ అయ్యీ నెలకు పైగా అవుతున్న ఆశించిన స్థాయిలో సిని వర్గా నుంచి స్పందన రాలేదు. కోలీవుడ్ అగ్ర హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్,  విశాల్ స్పందించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కానీ మన టాలీవుడ్ నుంచి కొంతమంది దర్శకులు, నిర్మాతలు స్పందించారు. మరోవైపు ఆ మొన్న మంత్రి రోజాను టీడీపీ మాజీమంత్రి బండారు తిడితే.. సిని నటీమణులు కవిత, రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా, నవనీత్ కౌర్ ఇలా చాలా మంది స్పందించి మంత్రి రోజాకు సంఘీభావం తెలిపారు. మరి.. నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్.., జనసేనాని పవన్ మూడు పెళ్లిళ్లపై.., ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడితే కనీస స్పందన కరువ్వడం శోచనీయం.

జగన్ అంటే ఎందుకు సినిమా వాళ్ళు జంకుతున్నారో.. తెలియని పరిస్ధితి. సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై ఈ విధంగా దాడులు జరుగుతుంటే ఎందుకు ఐక్యత రాగం వినిపించలేకపోతున్నారు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సినిమాలపై జగన్ తెచ్చిన చంకనాకించే సంస్కరణలు సైతం మరిచి.. జీ హుజూర్ అంటున్న తీరు  అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సినిమా టికెట్ ధరలు అమాంతం తగ్గించినా… బెనిఫెట్ షోలు ఆపివేసినా..,  ఆగ్ర కథనాయకులుగా చెప్పుకునే బ్యాచ్ అంతా సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి జగన్ కు చేతులెత్తి.. మొక్కిన కనుకరించిన వ్యక్తి ఆయన.

సినిమాలు పక్కనపెడితే.. ఇప్పుడు వ్యక్తిగత దూషణలు దిగుతుంటే చూస్తూ అలా ఉండిపోతే భవిష్యత్తు ఇక అంధకారమే. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వస్తూనే ఉంటారు కాలగర్భంగా కలిసిపోతూనే ఉంటారు..కానీ నాలుగు కాలాలు సినిమాలు ఆడాలన్నా..మనుడగ..,ఉనికి కాపాడుకోవాలన్నా సమయ స్పూర్తితో స్పందించే హృదయం మన హీరోలకు కావాలని అభిమానులు అంటున్నారు.ఇంత చిన్న లాజిక్ మిస్సై ఎందుకంత వెనుకబడుతున్నారో అర్థంకానీ పరిస్ధితి.