తెలంగాణలో కారు దిగిపోతున్న సీనియర్లు..!

తెలంగాణ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తెలంగాణ ఎన్నికల వేళ.. కూర్చిలాటలో నేతలు చేస్తున్న ఫీట్లు అన్నీఇన్నీ కావు. సరైన సమయం చూసుకుని జంపింగ్ జపాంగ్ లకు తెరతీస్తున్నారు నేతలు. సీనియర్లూ  సైతం పార్టీ కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యం లో అధికార పార్టీ కారు దిగేందుకు నేతలు సమాయక్తమవుతున్నారు.

టికెట్ రాని నేతలంతా పార్టీలు మారుతున్నారు. కాంగ్రెస్ లో టికెట్ రాని వాళ్లుకు బీఆర్ఎస్ ఆఫర్లు ఇస్తుంటే.. బీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు కాంగ్రెస్ ఆకర్షించే ప్రయత్నం  చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల, నాగం లు రాజీనామా చేసి.. పార్టీని వీడితే.., పొన్నాల గులాబి కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇప్పటికే.. పొంగులేటి.., తుమ్మల.., మైనంపల్లి తదితరులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుక సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో బాబురావు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. అక్కడ ఆయన రేవంత్ తో  చర్చలు జరిపారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావుకు సీటు దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాబురావు స్థానంలో అనిల్ జాదావ్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన సంగతి తెలింసిందే.