40 కేజీ బంగారం పట్టివేత.. తనిఖీల్లో రికార్డు బ్రేక్..!

తెలంగాణ ఎన్నికల వేళ.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయేలే డబ్బు, బంగారం, మద్యం పట్టుపడుతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. జిల్లాలతోపాటు హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్ళల్లోఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు చెక్ పోస్ట్ లు వెలిశాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు, ఎన్నికల సంఘం అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం, నగదు, మద్యం పట్టుపడుతోంది. వీటితోపాటు అక్రమంగా తరలిస్తున్న బంగారు అభరణలు.., డ్రగ్స్ పెద్దఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా నిన్న రాత్రి నల్గొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ కు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 40 కీలోల బంగారం, 19 కేజీల వెండి పట్టుపడింది. వాహనదారులు ఇందుకు సంబందించిన ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీన చేసుకున్నారు పోలీసులు.

అయితే పట్టుబడిన బంగారం జ్యువెలరీ షాప్ కు చెందిన బంగారం, వెండిగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుపడ్డ డబ్బు రూ.200 కోట్లు దాటింది. మొత్తంగా మద్యం, బంగారం, డబ్బు రూపంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 250 కోట్ల మేర సొత్తును పోలీసులు రికవరీ చేసుకున్నారు.

రూ.50 వేలకు మించి డబ్బును రవాణ చేయాల్సి వస్తే సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించాల్సి ఉంది. అలా కాకుండా అనుమానస్పందంగా ఉన్న డబ్బును మాత్రమే అధికారులు సీజ్ చేస్తున్నారు. బ్యాంకు నందు వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు తప్పనిసరిగా సంబంధించి పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో హవాలా రూపంలో ధన ప్రవాహం తెలంగాణ వ్యాప్తంగా అధికంగా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ప్రజలు  కూడా ఈ విషయాల్లో అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.